బలవంతుల చేతిలో బలహీనుడు బానిసగా బ్రతికే రోజుల్లో జరిగిన ఘటన. బానిసలు అంటే ఒక ఊడిగం చేయడమే కాదు. వారి ప్రాణాలను తీస్తున్నా కూడా ఎదురు తిరగక పోవడం. అత్యంత హేయమైన సంఘటనలు మన చరిత్రలో ఎన్నో జరిగాయి. వాటికి సాక్ష్యంగా మనుషులు లేకపోవచ్చు కానీ ఈ పుడమి, ఆ నింగి, ఈ గాలి. ఇలా పంచభూతాలన్ని ఇలాంటి మారణ హోమాలకు సజీవ సాక్షాలుగా, మూగగా మారిపోయి. అప్పుడప్పుడు ఇలా చరిత్రను గుర్తు చేస్తున్నాయి..

 

 

ఇకపోతే బలహీనులను చంపడం అనే విధానాన్ని అవలంభించిన తీరు. ప్రతి వారి కంట కన్నీరు పెట్టిస్తుంది. ఒక మనిషిని ఇలా కూడా శిక్షించవచ్చా అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. నిజానికి ఇలా మరణించే వారంతా నేరస్తులు కాదు, కరుడుగట్టిన ఉగ్రవాదులు కాదు. కాని వీరిని ఇలా ఎందుకు చంపాలనుకున్నారంటే వారి అవసరం తీరిపోయింది కనుక. వీరు శారీరకంగా బలహీనులుగా మారగా, అంతవరకు వారి శ్రమను దోపిడి చేసిన ఆ సైన్యం ఇక వారితో అవసరం తీరిపోగా ప్రపంచం చెడ్దవాడుగా అసహ్యహించుకునే నాయకుడైన హిట్లర్ ఆదేశాలమేరకు. ఇలాంటి వారందరిని ఆరోగ్య వైద్యపరీక్షల పేరిట పోలండ్ లోని ఆష్‌విజ్‌లో ఉన్న ఒక కర్మాగారం లాంటి బందీఖానాలోకి పంపి చంపారు..

 

 

యూరప్ లోని పలు దేశాలను ఆక్రమించిన నాజీలు అక్కడ ఉన్న యూదులను కుటుంబాలతో సహా ఇక్కడకు పంపించేవారు. అక్కడ వారిని గ్యాస్ ఛాంబర్లకు పంపించి సామూహికంగా హత్య చేసేవారు. ఒకవేళ ఎవరైన ఈ కౄరచర్యను పసిగట్టి పారిపోవాలని చూస్తే అక్కడ ఉన్న జాగిలాలు వారిని వేటాడి రక్తపుముద్దలుగా మార్చేవి, అయినా రక్తదాహాం ఆరని ఈ నీచ సైన్యం వారి దగ్గరకు వెళ్లి కాల్చి చంపేవారు. ఇలా ఈ నాజీ సైనికులు ఆ గ్యాస్ ఛాంబర్‌లోకి ఒక్కోసారి  2 వేలమంది వరకు పంపించేవారు. వీరిని చంపేందుకు నాజీలు ప్రత్యేకమైన విషవాయువులను తయారుచేశారు. దాదాపు 15 నిమిషాల్లో ఈ వాయువులను పీల్చినవారు మృత్యు ఒడికి చేరుకునేవారు.

 

 

ఏమాత్రం జాలి, దయ కనబరచకుండా ఆ గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలపై రాబంధుల్లా పడి, బంగారు ఆభరణాలుంటే దోచుకునేవారు ఆ సైనికులు. ఇలా ఇక్కడ దాదాపు 11 లక్షల మందిని చంపివేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆ చనిపోయిన వారిలో ఒక నెల బిడ్డ నుంచి 80 ఏళ్ల వృద్ధులను కూడా ఎలాంటి జాలి లేకుండా చంపివేశారు. ఇలా మరణించిన వారిలో యూదులతో పాటు 75 వేలమంది పోలిష్  జాతీయులు, 21 వేల రోమా జాతీయులు, 14 వేలమంది సోవియట్ యుద్ధ ఖైదీలు ఉన్నారని చరిత్ర చెబుతుంది. ఇకపోతే 1945లో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. లక్షలాది ప్రాణాలు బలిగొన్న ఒక రాక్షసుని చరిత్ర ముగింది. ఇంతలా మారణ హోమాలు జరిపించిన హిట్లర్ అని చెప్పబడే ఆ నీచుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 

ఆ తర్వాత రష్యన్ ప్రభుత్వం తన సైనిక దళాలను పంపి ఇంకా బందీలుగా ఉన్న వారిని విముక్తుల్ని చేశారు. తమ కళ్లముందే అయిన వారందరిని పోగొట్టుకుని జీవచ్చంగా మిగిలిన వారు ఆ దారుణ కాండను మరచిపోలేక మానసికంగా ఎప్పుడో మరణించారు.. ఇకపోతే చరిత్ర తన గర్భంలో దాచుకున్న ఈ వేదనకు గుర్తుగా 1945 జనవరి 27న ఈ ఊచకోతలో బలైన లక్షలాదిమంది జ్ఞాపకార్థం యూరప్, అమెరికా, ఇజ్రాయెల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.. ఇలాంటి ధీనగాధలు మనకు తెలియకుండా ఎన్నో చీకట్లో కలిసిపోయాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: