సీఎం జగన్... అధికారంలోకి వచ్చినప్పటి నుండి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని సీఎం జగన్ ఒక అద్భుతం.. ఒక సంచలనం అని అనిపించుకున్నారు. సంచలనాల సీఎం గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే స్పీడ్ లో మరో రికార్డుని సొంతం చేసుకుంది సీఎం జగన్ సర్కార్. 

 

శాసనమండలి రద్దు జరిగింది. అయితే రాజకీయ హిస్టరీలోనే ఒక్క నెగటివ్ ఓటు కూడా లేకుండా ఓకేసారి మూడు పార్టీల నేతలు లేచారు.. ఒక్కటంటే ఒక్కటి కూడా నెగిటివ్ ఓటు కూడా లేకుండా శాసనమండలి రద్దు ఆమోదం పొందింది. అది ఎలా అనేది చుడండి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శానమండలి రద్దు తీర్మానాన్ని శాసన సభ కొద్దిసేపటి క్రితమే ఆమోదించింది. 

 

ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అయితే శాసనమంది రద్దు చేసే సమయంలో మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇచ్చే వారు లేచి నిలబడాల్సిందిగా సూచించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ లేచి నిలబడ్డారు. 

 

దీంతో సభ్యులను లెక్కించారు. అనంతరం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించేవారు నిలబడాలని కోరారు. అయితే సోమవారం నాటి అసెంబ్లీ సమావేశానికి హాజరుకాకూడదని ప్రతిపక్ష టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్ ప్రతిపాదించిన శాసన మండలి రద్దు తీర్మానం నెగ్గిందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. 

 

ఇకపై శాసన మండలి మనుగడలో ఉండబోదని అయన చెప్పారు. ఈరోజు సోమవారం ఉదయం శాసనసభలో సీఎం జగన్ మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు, చివరగా సీఎం జగన్ మాట్లాడిన తర్వాత ఓటింగ్ నిర్వహించి మండలి రద్దును స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. 

 

అయితే.. సీఎం జగన్ కు ఈ రికార్డు సొంతం చెయ్యడానికే టీడీపీ ఈరోజు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు అని.. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని.. ఒక్క ఓటు కూడా నెగటివ్ లేకుండా ఇలా అవ్వడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: