ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రతివారం కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం జగన్ పరిపాలనా వ్యవహారాలతో పాటు సంక్షేమ పథకాల అమలుతో బిజీ అయ్యారు. పరిపాలనా వ్యవహారాలతో బిజీగా ఉండటంతో పలుమార్లు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. 
 
ఒకసారి మాత్రమే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టు సీఎం జగన్ తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేయటంతో గతంలో ఒకసారి కోర్టుకు జగన్ హాజరయ్యారు. ఆ తరువాత జగన్ కోర్టుకు హాజరు కాకపోవటంతో జగన్ తరపు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ ను దాఖలు చేశారు. తాజాగా సీఎం జగన్ హైకోర్టులో అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్ లో జగన్ సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపుకు నిరాకరించడంతో సీఎం జగన్ సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సీఎం జగన్ ఈ పిటిషన్ లో తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని పరిపాలనాపరమైన విధులను నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. 
 
తనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనే నెపంతో వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించడం సరి కాదని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ గతంలో హైకోర్టు జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం జగన్ సీఎం హోదాలో ఉండటంతో పిటిషన్ విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: