ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా చాలా కాలంగా కొంతమంది యాజమాన్యాల సొంత లాభం కోసం పాకులాడుతూ కొంతమంది రాజకీయ నాయకులకు భజన చేస్తూ మీడియా పై జనాలకు అసహ్యం కలిగేలా వ్యవహరిస్తూ.... కథనాలను వండి వార్చుతున్నాయి. ఇక మీడియా మేనేజ్మెంట్ లో సిద్ధహస్తుడు గా పేరుపొందిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కొన్ని మీడియా ఛానల్స్ భజన చేస్తూ తెలుగురాష్ట్రాల ప్రజల్లో పచ్చ మీడియా గా గుర్తింపు తెచ్చుకున్నాయి. సదరు చానెల్స్ పై ఎన్ని విమర్శలు వచ్చినా నిస్సిగ్గుగా బాబు భజన లోనే ఉంటూ తన స్వామి భక్తిని చాటుకుంటున్నాయి.


ఏపీలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడంతో టీడీపీ నాయకులకంటే ఎక్కువగా సదరు పచ్చమీడియా ఏడుపులు పెడబొబ్బలు పెట్టాయి. అంతేనా టీడీపీ ఏపీలో ఓడిపోవడం ప్రజలు చేసుకున్న పాపం లా కథనాలు అల్లుతూ తమకు బాబు మీద ఎంత ప్రేమ ఉందో చెప్పుకునే ప్రయత్నం చేసాయి. మొదటి నుంచి తాము వ్యతిరేకించడమే కాకుండా జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగేలా చేసినా జగన్ అధికారంలోకి రావడం మింగుడుపడడం లేదు. ఇక ఇటీవల జగన్ ప్రకటించిన మూడు రాజధానుల విషయంలోనూ ఇదేరకంగా వ్యవహరించి విమర్శలపాలయ్యింది.

 

ఓ పచ్చ మీడియా అధినేత అయితే తన స్వామి భక్తిని దాటుకుంటూ జగన్ నిర్ణయంపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు.అదే సమయంలో మిగతా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల ప్రాంతాల్లో జగన్ నిర్ణయంపై సానుకూల దృక్పధం ఉన్న విషయాన్ని పెద్దగా ప్రచారం  కాకుండా అడ్డుకుంటూ బాబు పై తనకున్న ప్రేమను చాటుకునే ప్రయత్నం చేస్తోంది. 


ముఖ్యంగా ఆ మీడియా ఛానల్ అధినేత శ్రీ కృష్ణ పరమాత్ముడులా  నీతులు చెబుతూ తన పత్రికలో, ఛానల్ లోనూ తన అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తూ విమర్శలు పాలవుతున్నాడు .తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అదేవిధంగా కథనాలు ఆ పచ్చ మీడియా అధినేత తన చానల్లో ప్రసారం చేస్తున్నారు.

 

ఓవైపు అసెంబ్లీలో వైసీపీ మంత్రులు జగన్ ప్రస్తుత వ్యవహారాలపై కీలక విషయాలు గురించి చర్చిస్తూ ఉంటే అన్ని చానల్స్ వీటిని కవర్ చేయగా ఆ పచ్చ మీడియాలో మాత్రం టిడిపి నాయకుల ఆందోళన,బాధను గురించి చూపిస్తూ టిడిపి నాయకుల కంటే తీవ్ర ఆవేశంతో ఆ పచ్చ మీడియా చానల్ ప్రతినిధులు ఊగిపోతూ... రాష్ట్రంలో అల్లకల్లోలం జరిగిపోతున్నట్లు గా బ్రేకింగ్ న్యూస్ లు వేస్తూ యథావిధిగా బావురుమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: