ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో కీల‌క ఘ‌ట్టం నేడు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంత‌రం ఏపీ అసెంబ్లీ తీర్మానానికి ఆమోదం తెలిపింది. మొత్తం 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. తీర్మానం ఆమోదం పొందిందని సభలో తెలిపిన స్పీకర్... అనంతరం సభ నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, ఈ కీల‌క నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. తాజాగా ఈ విష‌యంలో మ‌రో కీల‌క అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ సీనియ‌ర్ నేత కే నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

 

శాస‌న‌మండలి రద్దుపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ జగన్ తీరు వల్ల వ్యవస్థకు నష్టం అని అన్నారు. ``కౌన్సిల్ వ్యవస్థకు మా పార్టీ వ్యతిరేకం.. కానీ, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో బలం ఉందని ఏకపక్షంగా రద్దు చేస్తున్నారు.. ఇది సరైంది కాదు` అని అన్నారు. ఆత్రంగా సీఎం జగన్ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని హెచ్చరించారు. ``అమిత్ షా హామీతోనే కౌన్సిల్ రద్దు విషయంలో జగన్ ముందుకు వెళ్లరని అనుకుంటున్నాం. శాసనమండలి రద్దుకు తీర్మానం చేసిననప్ప‌టికీ...ఆమోదం పొంది అమ‌లులోకి వ‌చ్చేస‌రికి సంవత్సరం కాలం పట్టవచ్చు.`` అని వ్యాఖ్యానించారు.

 

ఇదిలాఉండ‌గా, ఓటు వేసిన‌ 133 మంది ఎమ్మెల్యేల్లో అధికార వైసీపీకి చెందిన వారు 132 మంది మ‌రొక‌రు జ‌న‌సేన ఎమ్మెల్యే. ఓటింగుకు దూరంగా 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓటింగు కంటే ముందుగానే అసెంబ్లీ నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఓటింగ్ జరుగుతోన్న సమయంలో అసెంబ్లీ లాబీల్లోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉండిపోయారు. ఓటింగ్ సమయంలో అసెంబ్లీలో మద్దాలి గిరి కనిపించలేదు.. మరోవైపు తీర్మానానికి అనుకూలంగా జనసేన ఎమ్మెల్యే రాపాక ఓటు వేశారు. మొత్తానికి వైసీపీ 132+జనసేన 1 మొత్తం 133 మంది ఎమ్మెల్యేలు శాసనమండలి రద్దు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో, బిల్లు నెగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: