డబ్బు మీద పిచ్చితో చాలా మంది స్థాయిని మరచి కూడా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది మాత్రం చేతిలో ఉద్యోగం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఎక్కడ చుసిన కూడా హత్యలు, దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే జనాలను కాపాడలిసిన ప్రముఖ వృత్తుల్లో ఉన్న వ్యక్తులు జనాలను కాపాడల్సింది పోయి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. 


వివరాల్లోకి వెళితే.. రైల్లో ప్రాణాలను కాపాడాల్సిన గార్డు ఓ మూడేళ్ళ చిన్నారి పై దారుణాని కి పాల్పడ్డాడు. పొర పాటున వికలాంగుల బోగీ లోకి ఎక్కిన దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి మూడేళ్ల కుమారుడిని కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేశాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన వెంకటేష్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం తుని సమీపంలోని లోవ గ్రామంలో ఉన్న తలుపులమ్మ ఆలయానికి వెళ్లాడు.

 

అయితే వాళ్ళు దర్శించుకొని తిరుగు ప్రయాణం లో మళ్ళీ రైల్లో ఖాళీ లేకపోవడం తో రద్దీ కారణంగా బోగీలు ఖాళీ లేకపోవడం తో వికలాంగుల బోగీ ఎక్కేశారు. అందులో ఉన్న రైల్వే గార్డు వారిని మంద లిస్తూ.. వికలాంగుల బోగీలో ఇతరులు ఎక్క కూడదని, దిగిపోవా లని హెచ్చరించాడు. దీంతో వారం తా దిగేందుకు యత్నించినా రైలు అప్పటికే వేగం అందుకోవడం తో సాధ్యం కాలేదు.

 


కోపస్తుడైన ఆ గార్డు ఈ బాలుడి ని రైల్లోంచి బయటకు దోసేసాడు. లక్కీ గా ప్లాట్‌ఫామ్‌పైనే పడటం తో స్వల్పగాయా లతో బయటపడ్డాడు. దీంతో చైన్ లాగి ట్రైన్‌ ఆపేసిన వెంకటేశ్ గార్డు నిర్వాకంపై తుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జీఆర్పీ ఎస్సై అబ్దుల్‌ మారూఫ్‌ గార్డుపై కేసు నమోదు చేశారు.  పాసింజెర్స్ తో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి అంటూ మందలించారు. గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: