అప్పుడ‌ప్పుడు స‌ర‌దా స‌ర‌దాగా కొన్ని కాంపిటేష‌న్స్ పెడుతుంటారు. అందులో ఫుడ్ కాంపిటేష‌న్ ఒక‌టి. ఆ ఫుడ్ కాంపిటేష‌న్‌లో పొల్గొన్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏదో మ‌నం ఫ‌స్ట్ రావాల‌నే ఆత్రుత‌తో అధికంగా ఆహారం తీసుకున్నా ఒక్కోసారి అవి మ‌న ప్రాణాల‌కే ప్ర‌మాదం తెచ్చిపెడ‌తాయి. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఈ మ‌ధ్య ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. 

 

ఓ మ‌హిళ కేక్ ఈటింగ్ అనే కాంపిటేష‌న్‌లో పాల్గొనింది. ఆస్ట్రేలియా డే సంద‌ర్భంగా క్వీన్స్ ల్యాండ్‌లోని బీచ్ హౌస్ వ‌ద్ద హోట‌ల్‌లో కేకు తినే ఈటింగ్ కేక్ పోటీల‌ను నిర్వ‌హించారు. ఆ కేక్ తినే పోటీలో పాల్గొని మ‌హిళ మృతి చెందింది.  ఆస్ట్రేలియాలోనే  ఫేమస్ అయిన ల్యామింగ్‌టన్ కేకులను ఈ పోటీలో ఉంచారు. ఈ పోటీలో 60ఏళ్ళ మ‌హిళ పాల్గొని ల్యామింగ్‌ట‌న్ కేకుల‌ను పోటీలో భాగంగా త్వ‌ర త్వ‌ర‌గా తినే ప్ర‌య‌త్నం చేసింది. కొన్ని కేక్ ముక్క‌ల‌ను తిన‌గానే ఆ మ‌హిళ అనుకోకుండా  స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హోటల్‌ యాజమాన్యం ఆమెను హుటా హుటిన‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. వెంట‌నే వైద్య  పరీక్షలు నిర్వహించ‌గా వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిన‌ట్లు దృవీక‌రించారు. 

 

దీంతో ఆ మ‌హిళ మృతి ప‌ట్ల హోట‌ల్ యాజ‌మాన్యం షాక్‌కి గుర‌యింది. ఆహ్లాదకరంగా జరుగుతున్న పోటీలో ఇలా మహిళ ప్రాణాలను పోగొట్టుకోవడం తమకు ఎంతో బాధగా ఉందంటూ హోటల్ యాజమాన్యం ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే దీంతో ఇలా జ‌రిగినందుకు మహిళా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హోట‌ల్ యాజ‌మాన్యం హామీ ఇచ్చారు.  తాము ఫోన్ చేసిన నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్న అంబులెన్స్ సర్వీసుకు హోటల్ సిబ్బంది ఎంతో కృత‌జ్ఞ‌త‌తో ధన్యవాదాలు తెలిపారు. మ‌రి ప్ర‌తి ఏటా త‌క్కువ స‌మ‌చంలో ఎక్కువ తినే వారిని విజేత‌లుగా ప్ర‌క‌టిస్తారు ఈ విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: