మొన్నటి వరకు రాజధాని అమరావతి చుట్టూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు జరగగా తాజాగా శాసన మండలి రద్దు అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు అసెంబ్లీలో శాసన మండలి రద్దు అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి చంద్రబాబుపై మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అంతేకాకుండా దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉందని...విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో మండలి అవసరమా అని పైగా రాష్ట్ర ప్రజలకు మరియు అభివృద్ధికి ఒక ఉద్దేశపూర్వకంగా శాసనమండలి లో ఉన్న పెద్దలు అడ్డుకోవటం ఏమిటని సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వాళ్ళు శాసనమండలిని వేదికగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఇది చాలా దారుణమైన పరిణామమని ఏకంగా ఏడాదికి శాసనమండలి నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 60 కోట్లు ఖర్చు అవుతుందని చాలా సీరియస్ గా జగన్ అసెంబ్లీలో వ్యవహరించారు.

 

ఇటువంటి టైములో అసెంబ్లీ లో బిల్లు ఆమోదించే విషయంలో కొంత మంది వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, పార్థసారథి మరొక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఓటింగ్ సమయంలో గైర్హాజరయ్యారు అని...శాసన మండలి రద్దు బిల్లు అనే ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు అని దీంతో ఈ విషయం ఓటింగ్ అయ్యాక జగన్ దృష్టికి వెళ్లడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలను తన చాంబర్లోకి పిలిపించుకుని గట్టిగా క్లాస్ పీకినట్లు వైసిపి పార్టీ వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. 

 

మొత్తం మీద సోమవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో శాసనసభ రద్దు అనే అంశం గురించి వైసీపీ పార్టీ నేతలు ముఖ్యంగా వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ప్రసంగించడం తో ఇప్పుడు ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: