’తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వని కోర్టులను కూడా రద్దు చేసేస్తారా’ ?

’ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సొస్తోందని శుక్రవారాన్ని కూడా రద్దు చేసేస్తారా’ ?

 

ఇవి శాసనమండలి రద్దు తీర్మానం సందర్భంగా నారావారి పుత్రరత్నం లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి  వేసిన సూటి ప్రశ్నలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శాసనమండలిని రద్దు చేసేయాలని జగన్ డిసైడ్ అయినప్పటి నుండి లోకేష్ లో ఫ్రస్ట్రేషన్ పీక్ కు చేరుకునేసింది. ఎంఎల్ఏగా పోటి చేసి గెలిచేంత ధైర్యం లేకే దొడ్డిదారిన శాసనమండలి సభ్యుడయ్యారు. సరే తండ్రే ముఖ్యమంత్రి కాబట్టి ఎంఎల్సీ అయిన వెంటనే మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు.

 

స్ధూలంగా లోకేష్ ను గమనిస్తే ఎంఎల్సీ అవ్వటానికి మంత్రిగా పనిచేయటానికి చంద్రబాబునాయుడు కొడుకు అనితప్ప మరే అర్హతా కనిపించదు. అలాంటి లోకేష్ మొన్నటి ఎన్నికల్లో  మంగళగిరిలో పోటి చేసి చిత్తుగా ఓడిపోయారు. అమరావతిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్ళాం కాబట్టి తమకు తప్ప మరొకరికి ఓట్లు వేయరు జనాలు అనుకున్నారు. తీరా చూస్తే జనాలు తండ్రి, కొడుకులకు గట్టి షాక్ ఇచ్చారు. దానికి తోడు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో ఇద్దరిపైన  మానసికంగా దెబ్బ పడింది.

 

అప్పటి నుండి జగన్ పై ఇద్దరిలోను ఉక్రోషం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా రాజధానిగా అమరావతిని తరలించేయాలన్న ప్రతిపాదనతో పాటు శాసనమండలిని కూడా రద్దు చేసేయాలన్న తీర్మానంతో ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్ధం కావటం లేదు.  తొందరలోనే తన సభ్యత్వం పోవటంతో పాటు టిడిపి సభ్యులందరి పదవులూ ఊడిపోవటం ఖాయమని తేలిపోవటంతో నోటికొచ్చినట్లు లోకేష్ మాట్లాడుతున్నారు.

 

శాసనమండలి రద్దు విషయంలో లోకేష్ ప్రశ్నించాల్సింది జగన్ ను కాదు తన తండ్రి చంద్రబాబునే.  ఉద్దేశ్యపూర్వకంగానే మెజారిటి ఉంది కదాని ప్రతి బిల్లును టిడిపి మండలిలో అడ్డుకుంటోంది. మొన్నటి బిల్లుల విషయంలో కూడా ఛైర్మన్ ను మ్యానేజ్ చేసుకుని టిడిపి తొండాటాడింది. దానితో జగన్ కు మండిది. శాసనమండలికి మూడింది. ఆ ఫ్రస్ట్రేషనే లోకేష్ లో ట్విట్టర్ రూపంలో బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: