ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ మోయిల్ చేసి శాసనమండలి రద్దు ఆలోచనను విరమించుకునేట్లు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా చాలానే కష్టపడింది. గడచిన మూడు  రోజులుగా వాళ్ళు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ బెదిరింపులకు జగన్ లెక్క చేయకుండా  శాసనమండలిని రద్దు చేస్తు ముందు క్యాబినెట్ లోను తర్వాత అసెంబ్లీలోను తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నారు.

 

జగన్ ను ఎలాగైనా లొంగ దీసుకోవాలని చంద్రబాబు చాలానే ఫీలర్లు వదిలారు. తాను మండలి రద్దుకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడినట్లు తన మీడియిలో ప్రచారం చేయించారు.  మండలిని రద్దు చేస్తు ప్రభుత్వం తీర్మానాన్ని ఢిల్లీకి పంపినా ఉభయసభల్లో ఆమోదించకుండా చంద్రబాబు హోంశాఖ మంత్రితో మాట్లాడినట్లు చెప్పించారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లీకి వెళతారని జాతీయస్ధాయి నేతలతో  మాట్లాడుతారని, నరేంద్రమోడిని కూడా కలవబోతున్నట్లు ఒకటే ఊదరగొట్టించారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శాసనమండలి రద్దుకు కేంద్రానికి ఏ విధమైన సంబంధం లేదు. మండలి రద్దు నిర్ణయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశం.  ఇక  మండలి రద్దు గురించి  చంద్రబాబు మాట్లాడితే నరేంద్రమోడి, అమిత్ షా వింటారా ?  చివరగా జాతీయస్ధాయి నేతలతో చర్చలట. జాతీయ నేతలకు ఇంకేమీ పనిలేదా ?  ఏపిలోని ఒకచిన్న అంశాన్ని అందులోను చంద్రబాబుకు సంబంధించిన విషయంపై జాతీయ నేతలు ఏమి చేస్తారు ?

 

151 ఎంఎల్ఏల  బంపర్ మెజారిటితో అధికారంలో ఉన్న జగన్ను కాదని చంద్రబాబుకు కేంద్రం మద్దతుగా ఉంటుందా ? రాజ్యసభలో ఇపుడున్న  వైసిసి బలం వచ్చే ఏప్రిల్ నెల తర్వాత ఆరుకి పెరుగుతుంది. అంటే 6 మంది రాజ్యసభ ఎంపిలున్న జగన్ తో నరేంద్రమోడికి ఎంతగా అవసరం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 

అదే సమయంలో టిడిపి రాజ్యసభ ఎంపిల పదవీ కాలం అయిపోతోంది. ఇలా ఏ రకంగా చూసినా మండలి రద్దుకు వ్యతిరేకంగా అందులోను చంద్రబాబు చెప్పినట్లుగా వినాల్సిన అవసరం కేంద్రానికి లేదు. ఇంతచిన్న లాజిక్ ను పక్కనపెట్టేసి ఎల్లోమీడియా జగన్ ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తే జరిగేపనేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి: