జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులు రాకుండా బార్డర్ వద్ద ఇనుప కంచె నిర్మిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అనడంతో పాకిస్తాన్ లోవున్న డీ-రాడికలైజేషన్ శిభిరాలు చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ఇలాంటి మాట‌ల‌ను పాకిస్తాన్ ఎంత‌మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న ఉగ్ర కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. యువకులకు బలవంతంగా ఉగ్రవాద శిక్షణ ఇస్తోంది. తాజాగా ఈ విష‌యం బ‌ట్ట‌బ‌యలు అయింది.

 

పాకిస్తాన్ లోని పంజాబ్, బలుచిస్తాన్, ఖైబర్ పఖ్తున్వా ప్రాంతాలలో డజనుకు పైగా ఉగ్రవాద శిక్షణా శిభిరాలు ఉన్నట్లుగా భారత ఇంటలీజెన్స్ కు సమాచారం అందింది. దీంతో పాటు ఉపగ్రహ చాయా చిత్రాలలో ఉగ్రవాద శిక్షణా శిభిరాలు కనిపించాయి. ఒక్కో శిభిరంలో 700మందికి పైగా ఉగ్రవాద శిక్షణ తీసుకుంటున్నారు. ఇలాంటి శిభిరాలు దాదాపుగా 20 దాకా ఉన్నట్లు సమాచారం. 92శాతం 35సంవత్సరాలలోపు వయసున్నవారుకాగా, 12శాతం యువకులు 18ఏళ్ల వయసున్నవారున్నారని తెలిసింది.  వీరికి ప్రార్థనలు చేసుకోడానికి మసీదులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, విలాసవంతమైన గదులు ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రచర్యలను కంట్రోల్ చేయాల్సింది పోయి… వేల సంఖ్యలో  యువకులకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలేదని ఓ భద్రతా అధికారి అన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ బ్లాక్ జోన్ లో పడిపోతుందని చెప్పారు. 

 

 

 

ఇదిలాఉండ‌గా, పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ మాత్రం సాకులు వెతుక్కునే ప‌నిలో ఉన్నారు. హాలీవుడ్​ సినిమాల వల్ల పాకిస్తానోళ్లు చెడిపోతున్నరని,  దేశంలో సెక్స్​ క్రైమ్​ పెరగడానికి ఆ సినిమాలే కారణమని తేల్చారు. ఇస్లామాబాద్​లో కంటెంట్​ డెవలపర్లు, యూట్యూబర్లతో మాటామంతి సందర్భంగా ఆయన ఈ మాటలన్నారు. ఇప్పుడు పిల్లలకూ మొబైల్​ ఫోన్లుంటున్నాయని, గతంలో ఎన్నడూ లేనంతగా అవసరం లేని కంటెంట్​ కూడా దొరుకుతోందని ఆయన అన్నారు. వాటి వల్ల పెద్ద ముప్పు పొంచి ఉందన్నారు. ‘‘పాకిస్తాన్​లో లైంగిక నేరాలు పెరగడానికి కారణం హాలీవుడ్​, బాలీవుడ్​ సినిమాలే కారణం. వాటితో చైల్డ్​ పోర్నోగ్రఫీ, పీడోఫీలియా (పిల్లలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు) వంటివి పెరిగిపోతున్నాయి. ఆ నేరాలన్నింటిపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.`` అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: