అప్పుడు చంద్రబాబు చేయలేనిది ఇప్పుడు జగన్ చేసాడు..అని టీడీపీ కీలక వర్గాలు అంటున్నాయి. అయితే అప్పుడు చంద్రబాబు ఏదైతే చేసాడో ఇప్పడు జగన్ మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడని చాలా మంది అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అడుగులేస్తున్నారు. ‘ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూనే వుంటాం..’ అని గతంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు చెప్పారు. 

 

 

 

ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న వైఎస్‌ జగన్‌ అదే బాటలో నటుస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. 

కేవలం అమరావతినే  కాదు, గతంలో చంద్రబాబు చేపట్టిన కార్యక్రక్రమాలను జగన్ కొనసాగిస్తూ వస్తున్నాడు. టీడీపీ గతంలో ఏంచేసినా కూడా మధ్యలో వదిలేశారన్న విషయం తెలిసిందే.. ఈ విషయం పై జగన్ ముమ్మరం చేస్తున్నారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు..

 

 

జనసేన మాటల్లో చెప్పాలంటే ‘టీడీపీ – వైసీపీ’ది ’60-40’ బంధం. అవుననడానికి చాలా సాక్ష్యాలు కన్పిస్తున్నాయి. తాజాగా శాసన మండలి రద్దు విషయానికొస్తే చంద్రబాబు – వైఎస్‌ జగన్‌ ఒకే మాట మీద నిలబడినట్లు కన్పిస్తోంది. అయితే, ఒకప్పటి చంద్రబాబే ఇప్పుడు వైఎస్‌ జగన్‌.. అయితే చంద్రబాబు జాప్యం చేసినట్లు కాకుండా కొంచం త్వరగా పనులు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు..

 

 

మండలి రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు. దానికి గతంలో చంద్రబాబు చెప్పిన కారణాల్నే వైఎస్‌ జగన్‌ ఉదహరిస్తుండడం గమనార్హం. కానీ, మండలి రద్దుని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. మొత్తమ్మీద, ‘రాజన్న రాజ్యం’ తెస్తా.. అని ప్రజలకు చెబుతున్నప్పటికీ, తన తండ్రి అడుగు జాడల్లో నడవలేకపోతున్న వైఎస్‌ జగన్‌, చిత్రంగా తనకు రాజకీయ విరోధి అయిన నారా చంద్రబాబునాయుడిని ఫాలో అవుతుండడం విశేషమే మరి..కేవలం వైసీపీ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిన కూడజనల గురించి ఆలోచించడం లో జగన్ ఒక్క అడుగు ముందే అని చెప్పాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: