ఏపీ సీఎం జగన్ రాజధాని మార్పుపై చాలా పట్టుదలగా ఉన్నాడు. అందుకే వెంటనే ఏవో రెండు, మూడు కమిటీలు వేసి.. వాటి రిపోర్టులను చూపిస్తూ ఏకంగా పాలన వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టేశాడు.. మండలిలో తనకు బలం లేకపోయినా.. దాని ఆమోదంతో పని లేదు కాబట్టి జనవరి 26 కల్లా విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయొచ్చని అనుకున్నాడు.. కానీ ఏమైంది. డామిట్ కథ అడ్డం తిరిగింది.

 

మండలిలో ఆమోదం అవసరం కాకపోయినా.. అక్కడ ఆమోదం పొందక, అలాగని తిరస్కరించక మధ్యలో సెలెక్టు కమిటీ అనే ఇష్యూ తీసుకొచ్చి చంద్రబాబు జగన్ కు గట్టి జెల్లకాయే కొట్టాడని చెప్పాలి. ఇప్పుడు తప్పనిసరిగా కనీసం 3 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఠాఠ్.. నా అధికారానికి అడ్డువేసే మండలి అవసరం లేదు పొమ్మని ఏకంగా మండలినే రద్దు చేసేందుకు జగన్ నిర్ణయించేశాడు.

 

అయితే ఇక్కడే ఓ షాకింగ్ వాస్తవం బయటపడింది. అసలు రాజధాని మార్పు చేసేందుకు చట్టం చేయాల్సిన అవసరమే లేదట. ఈ విషయం ఏపీ ప్రభుత్వం తరఫున వాదించటానికి వచ్చిన సుప్రీం లాయర్ ముకుల్ రోహత్గీ జగన్ కు చెప్పాడట. మండలి విషయంపై సలహా తీసుకునేందుకు జగన్ ఆయన్ను పిలిపించాడు. ఆ తర్వాత బిల్లుల్ని మొత్తం చదివేసిన ముకుల్ జగన్‌ కు షాకింగ్ వాస్తవం చెప్పాడట..

 

జగన్ తో ముకుల్ ఏమన్నాడో తెలుసా.. ‘‘ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో పోయేదానికి రాజధాని బిల్లుల్ని ఎవరు ప్రవేశపెట్టమన్నారు మిమ్మల్ని..?’ అని ఎదురు ప్రశ్నించాడట. దీంతో జగన్ అవాక్కయ్యారని తెలుస్తోంది. అంటే సింపుల్ గా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేసి రాజధాని మార్చే అవకాశం ఉంటే.. ఆ విషయం తెలియక.. జగన్ బిల్లు దాకా వెళ్లి.. మండలిలో ఇబ్బంది పడ్డారన్నమాట. కానీ ఇప్పుడు తెలిసినా ఏం లాభం.. పరిస్థితి చేయిజారిపోయింది. ఏకంగా మండలి రద్దుకే ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: