ఇప్పుడు ఏపీ శాసన మండలి రద్దు కాబోతోంది. ఇందుకు ఏపీ శాసన సభ ఆమోదం తెలిపింది. తీర్మానం కేంద్రానికి వెళ్లబోతోంది. మండలి రద్దుతో నారా లోకేశ్ వంటి వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. ఎన్నికల్లో గెలవలేని వారికి ఇదో దొడ్డిదారిగా మారింది. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్సవుతోంది. అయితే ఈ మండలి రద్దుకు చంద్రబాబు ఓవర్ యాక్షనే కారణంగా కనిపిస్తోంది.

 

ఎందుకంటే.. మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉంది.. శాసన సభ చేసిన అభిప్రాయాలను మండలిలో చర్చించి తిరిగి పంపించవచ్చు. వైయస్ఆర్‌సీపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. వైయస్‌ జగన్ నాయకత్వంలో కీలక నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధించి, రాష్ట్రంలో కనీవిని ఎరుగని సుపరిపాలన, నీతివంతమైన పాలన తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు.

 

అయితే కీలక బిల్లులను మండలిలో అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు జగన్ ను చిరాకు పెడుతున్నరాు. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లను, ఇంగ్లీష్‌ మీడియం అమలు వంటి బిల్లులను మండలిలో ఆపాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. మండలిలో ఒక పేచీకోరుతనం ఉంది. బిల్లులను పాస్‌ కాకుండా ఆలస్యం చేయడం. అభివృద్ధిని అడ్డుకోవడం మండలిలో జరుగుతుంది. దుర్భుద్ధితో కావాలనే అడ్డుపడుతుండటంతో జగన్ మరో మార్గం లేక మండలిని రద్దు చేస్తున్నారు.

 

ఫలితాలను ప్రజలకు చూపించాలని ఆరాటపడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షం అడ్డుపడుతోంది. కేవలం 23 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు జగన్ ను అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన ఏకంగా రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరో ఏడాది పోతే వైసీపీకే మండలిలో మెజారిటీ ఉంటుంది. అయినా కూడా జగన్ మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యంమంటూ రద్దు చేసేశారు. ఇక ఇప్పుడు నారా లోకేశ్ వంటి పాలసీసా నాయకుల పరిస్థితి ఏంటో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: