ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో శాసన మండలిని రద్దు చేసేశారు. రద్దు తీర్మానానికి ఏపీ శాసన సభ ఆమోదం తెలిపింది. తీర్మానం కేంద్రానికి వెళ్లబోతోంది. ఇప్పుడు జగన్ తీసుకున్న మండలి రద్దుతో నారా లోకేశ్ వంటి వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. ఎన్నికల్లో గెలవలేని వారికి ఇదో దొడ్డిదారిగా మారింది. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్సవుతోంది. అయితే ఈ మండలి రద్దుకు చంద్రబాబు ఓవర్ యాక్షనే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

 

అయితే చంద్రబాబు చేసిన తప్పును గుర్తు చేస్తూ అంతా లోకేశ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలే రాజకీయ భవితవ్యం ఏమవుతుందో అని చినబాబు బెంగపెట్టుకుంటుంటే.. అంతా లోకేశ్ అసమర్థతను అసెంబ్లీలో గుర్తు చేస్తున్నారు. శాసన మండలి రద్దుకు చంద్రబాబే కారణమని, సాధ్యమైనంత త్వరలోనే శాసన మండలి రద్దు అవుతుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు.

 

నిరోధకశక్తులను పక్కకు నెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలిలో మేధావులు ఉన్నారు. మేధావులు కానీ వారు ఉన్నారు. లోకేష్‌ మండలికి ఎంపిక కావడం ధర్మమేనా?. రాజకీయంగా అఆలు రాని వ్యక్తిని తీసుకెళ్లి పెద్దల సభలో పెడితే ఏం ధర్మం? రాజకీయంగా నిరుద్యోగ సమస్య తీర్చేదా?. పెద్దల సభ చాలా పవిత్రమైన సభ. ఈ సభకు లోకేష్‌ లాంటి వ్యక్తులు వెళ్తే భ్రష్టుపట్టిపోతుంది.. అంటూ అంబటి లోకేశ్ నూ, బాబునూ ఏకేశారు.

 

" టీడీపీ దీనికి బాధ్యత వహించాలి. నాలుగు రోజులు అలస్యమవుతుందే కానీ, తప్పనిసరిగా మండలి రద్దు అవుతుంది. సాధ్యమైనంత త్వరలోనే సభ రద్దు అవుతుందని మేమంతా విశ్వాసంతో ఉన్నాం. మంచి మెజారిటీతో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందింది. చంద్రబాబు చెప్పే అనైతిక మాటలు నమ్మొద్దని ప్రజలకు అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.. పాపం.. చంద్రబాబు చేసిన దానికి చినబాబును తిడితే ఎలా.. ? పాపం కదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: