సీఎం జగన్ నిన్న రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.. శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి శాసన సభ ఒక్క నెగటివ్ ఓటు కూడా లేకుండా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.. అయితే ఆలా ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దుపై తెలుగు దేశం పార్టీ నేతలు భారీ ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.. 

 

ఇంకా ఈ విషయంపై కేశినేని నాని మరో అడుగు ముందుకు వేశారు.. తెలుగు దేశం పార్టీ గతాన్ని మర్చిపోయి మాట్లాడాడు.. నెటిజన్లతో మాటలు పడ్డాడు.. మండలి రద్దుపై టిడిపి ఎంపి కేశినేని నాని ట్విట్టర్‌లో స్పందించారు. కేశినేని ట్విట్ చేస్తూ.. ''జగనన్న మొన్నటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించింది 28 మంది ఎమ్మెల్సీల దెబ్బకు భయపడి పారిపోవడానికి కాదు. దమ్ముగా పోరాడతావని, ఇంత పిరికి వాడివి అని అనుకోలేదు'' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

 

అయితే ఈ ట్విట్ నెటిజన్లు గమ్మత్తుగా స్పందించారు.. ఎక్కడిక్కడ ట్విట్టర్ లో ఆయనను ఆడేసుకున్నారు. శాసన మండలి రద్దు గురించి ఒక్క సీఎం జగన్ ది మాట్లాడుతావ్ ఏంటి ? అని.. ఈ ట్విట్స్ గోలలోకి ఎన్టీఆర్ ని కూడా తీసుకొచ్చారు. అది ఏం అని అంటే.. ఇప్పుడు సీఎం జగన్ భయపడినట్టు అయితే.. అప్పట్లో మీ పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ కూడా భయపడినట్టే కదా కేశినేని అని ఒకరు కామెంట్ చేస్తే.. 

 

మరొకరు స్పందిస్తూ.. నువ్వు ఎప్పటికైనా ఆ పచ్చ రంగుని తీసి వైసీపీలోకి వచ్చేవాడివే.. నీకెందుకు ఈ గోల ? అని ఒకరు ప్రశ్నిస్తే.. మరొకరు స్పందిస్తూ.. చూడు కేశినేని.. అది బయపడి తీసుకున్న నిర్ణయం కాదు.. మంచి జరగాలంటే ఆ నిర్ణయమే కరెక్ట్.. కొంచం చూసి మాట్లాడు అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: