రేవంత్ రెడ్డి.. కొడంగల్ పులి.. తెలుగు దేశం పార్టీలో ఉన్న ఈయన 2017లో అనూహ్యంగా కాంగ్రెస్ లో ప్లాన్ తో వెళ్లి చేరాడు.. ఒక రకంగా తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ మనుగడ లేకుండా పోవడానికి ఈ రేవంత్ రెడ్డి ఏ కారణం. అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఏమో అవుతుంది అనుకున్నాం.. కానీ 2018 సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అయన నియోజికవర్గంలోనే అయన గెలవలేకపోయాడు.. 

 

ఏదో అదృష్టం బాగుండి 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కాస్త పరువు నిలుపుకున్నాడు.. లేకపోయింటే ఆ పరువు కాస్త ఉండేది కాదు.. అసలు ఇంకా ఈ 5 ఏళ్ళు రాజకీయాలలో కనిపించేవాడు కాదు.. కానీ గెలిచాడు. అయినా పార్టీ అయితే అధికారం లేదు.. ఏ ఎన్నికలు ఉన్న ఈ మధ్య నోరు పారేసుకుంటూ అవమానాలపాలవుతూ ఉన్నాడు.  

 

మొన్నటికి మొన్న.. హుజుర్ నగర్ లో ఉప ఎన్నిక జరగ్గా అందులో.. కేటీఆర్ కు మీ అక్కను గెలిపించుకోలేకపోయావ్.. మా అక్కను గెలిపించుకుంటా.. చూడు అన్నాడు. కానీ చివరికి ఘోరంగా అవమానాల పాలయ్యాడు. ఇంకా నిన్న.. మున్సిపల్ ఎన్నికల్లో ఎంత అంటే అంత నోరు పారేసుకున్నాడు. కానీ ఉపయోగం లేకపోయే.. ఘోరంగా అంటే ఘోరంగా తెలంగాణాలో కాంగ్రెస్ ఓడిపోయింది. 

 

అయితే.. ఇక్కడ తెలంగాణాలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలనే ఏమి చెయ్యలేని పరిస్థితి.. అలాంటిది ఈయనకు ఎందుకు ఆంధ్ర రాజకీయాల గురించి అని కొందరు నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.. ఎందుకు అంటే.. నిన్న ఆంధ్రాలో మండలి రద్దుపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.. ఆ స్పందనపైనే ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. 

 

రేవంత్ రెడ్డి మండలి రద్దుపై మాట్లాడుతూ.. ''అదిరాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, పెద్దలసభ రద్దు అనేది సహేతుకమైన చర్యకాదని, బిల్లు ఆమోదం పొందలేదని మండలినే రద్దు చేయడం సరికాదని సూచించారు. ఎన్ని రాజధానులు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

 

ఏపీ పరిణామాలు చూస్తే నవ్వాలో, ఏడువాలో అర్థంకావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ స్నేహం వల్లే జగన్‌కు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. కేసీఆర్‌తో స్నేహం జగన్‌కు అంత మంచిదికాదని పేర్కొన్నారు. కౌగిలించుకున్న వారందరికీ కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారు'' అని చెప్పారు రేవంత్‌ రెడ్డి.

 

అయితే ఈ సూచనలపైనే నెటిజన్లు ఫైర్ అయ్యారు.. నీ రాజకీయం చూస్తే.. నవ్వాలో ఏడవల్ అర్థం కాదు.. అలాంటిది ఆంధ్ర రాజకీయాలపై నీకెందుకు? అంటూ ఘాటుగా ప్రశ్నలు వేశారు.. మరికొందరు స్పందిస్తూ.. అయినా నువ్వు నీ రాజకీయం.. తెలంగాణాలో కాంగ్రెస్ రాజకీయం చూసుకోవయ్యా.. నీకెందుకయ్యా ఆంధ్ర రాజకీయాల గురించి అంటూ మరికొందరు నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరి మీరు ఎం అంటారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: