దోమ కుడితే ఎం అవుతుంది? ఒకటి రెండు కుడితే దద్దుర్లు వస్తాయి.. అదే ఎక్కువ కుడితే మలేరియా వస్తుంది.. అదే మరి ఎక్కువ కుడితే ఆ మలేరియాతోనే పోతారు. అయితే ఇక్కడ మాత్రం తూనీగా లా ఉండే ఓ దోమ కుడితే ప్రాణాలు పోతున్నాయి. అంత డెంజరస్ దోమ అది.. రాకాసి దోమ.  

 

దోమ అసలు కథ ఏంటి అంటే.. స్పెయిన్‌లోని కార్డోబ ప్రాంతంలో తూనీగ అంత పెద్ద ఓ దోమ సంచరిస్తోందట. ఎజెక్వీల్ లోబో అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ''అది మా ఇంటి కిటికీ నుంచి గదిలోకి ప్రవేశించింది. దాన్ని చూడగానే మా అమ్మ పురుగుల మందును స్ప్రే చేసింది. దీంతో అది చనిపోయింది'' అని ఆ ట్విట్ లో తెలిపాడు. 

 

అయితే.. ఇది దోమేనా? లేకా ఇంకా వేరే ఏదైనా కీటకమా? మీరు ఇలాంటి జీవిని ఎక్కడైనా చూశారా? అని ట్వీట్టర్‌లో అతను పేర్కొన్నాడు. అయితే లోబో పోస్టు చేసిన పోస్ట్ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ''వామ్మో, అంత పెద్ద దోమా? అది ఖచ్చితంగా గ్రహాంతరవాసి అయ్యి ఉంటుంది'' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

 

దోమ కేవలం డెంగ్యూ మాత్రమే కాదు, అన్నిరకాల వ్యాధులను ఒకేసారి వ్యాప్తి చేయగలదు అని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఈ ఫొటోను ఇప్పటివరకు 23 వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. 1.4 లక్షల మందికి పైగా లైక్ చేశారు... అయితే ఈ దోమ కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతారు... ఇది చాల డేంజర్ దోమ.. జాగ్రత్తగా ఉండాలి అంటూ కొందరు నెటిజన్లు కూడా ట్విట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: