తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ శాసన మండలి రద్దుకు తీర్మానం చేయించారని దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేయాలని అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన తరువాత వైసీపీ గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ విసిరారు. నిన్న రాత్రి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 
 
శాసన మండలి రాజధాని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో మీ అహం దెబ్బతిందని అందువలనే శాసన మండలి రద్దుకు తీర్మానం చేయించారని అన్నారు. రాజధాని మార్పు విషయంలో వైసీపీ వాదనకు ప్రజామోదం ఉందని భావిస్తే రెఫరెండం నిర్వహించాలని కోరారు. రెఫరెండం నిర్వహిస్తే అందులో ఏం వస్తే దానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు అన్నారు. వైసీపీ చేయించలేకపోతే సెలక్ట్ కమిటీ రెఫరెండం చేయిస్తుందని చెప్పారు. సెలక్ట్ కమిటీ నిర్వహించిన రెఫరెండం ను ఆమోదించాలని కోరారు. 
 
మండలికి సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని జగన్ చెప్పారని కానీ శాసన మండలి సంవత్సరంలో 30 నుండి 35 రోజులు మాత్రమే సమావేశం అవుతుందని అన్నారు. మండలికి కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారు. జగన్ తన అఫిడవిట్లో వారానికి ఒకసారి కోర్టుకు వెళితే 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారని ఈ లెక్కన లెక్క పెడితే జగన్ కోర్టు ఖర్చులే 30 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పారు. 
 
మరి 30 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని సీఎం పదవిని జగన్ వదులుకుంటారా...? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తన ఇంటికి 41 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం విడుదల చేస్తూ జీవోలు ఇచ్చారని మండలికి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందా...? అని చంద్రబాబు ప్రశ్నించారు. శాసన మండలికి 42 బిల్లులు వచ్చాయని కేవలం 3 బిల్లులను తప్ప అన్ని బిల్లులను ఆమోదించామని అన్నారు. మాట తప్పినట్లు తనపై జగన్ ఆరోపణలు చేస్తున్నాడని జగన్ మాట తప్పడాలు మడమ తిప్పడాలు చూపిస్తే జగన్ ముఖం కూడా ఎత్తుకోలేరని చంద్రబాబు విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: