మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన తండ్రిని కొట్టారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ తల్లి స్వయంగా ఈ విషయాన్ని రోశయ్య గారికి చెప్పారని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ తాను ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచానని చాలా సార్లు చెబుతూ ఉంటాడని తానేమీ తన తండ్రిని కొట్టలేదని చంద్రబాబు అన్నారు. 
 
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పిడి అవసరమైందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కూడా నాయకత్వ మార్పిడిని ఆమోదించారని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారని చంద్రబాబు చెప్పారు. అందువలనే ఇప్పటికీ సీనియర్ ఎన్టీయార్ ఫోటోతో ప్రజల ముందుకు వెళుతున్నామని చంద్రబాబు అన్నారు. సీనియర్ ఎన్టీయార్ తో ఆ ఒక్కటే మా విభేదం అని చంద్రబాబు చెప్పారు. 
 
సీఎం జగన్ ఎప్పుడూ తాను మాట తప్పినట్టు తనపై ఆరోపణలు చేస్తూ ఉంటాడని కానీ జగన్ మాట తప్పడం, మడమ తిప్పడం ఎత్తిచూపితే జగన్ ముఖం కూడా ఎత్తుకోలేరని చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు పాతిక ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తామని అన్నారని ఇప్పుడు మాత్రం జగన్ ప్రత్యేక హోదా అనే మాట ఎత్తడానికే భయపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. 
 
గతంలో జగన్ అమరావతికి అనుకూలమని చెప్పారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మాత్రం జగన్ మూడు రాజధానులు అంటూ పాట పాడుతున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా కడతారని జగన్ అన్నారని కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మాత్రం జగన్ వెళ్లారని చంద్రబాబు చెప్పారు. సన్న బియ్యం విషయంలో జగన్ మొదట ఒక మాట చెప్పారని ఆ తరువాత మాట మార్చారని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: