ఒకప్పుడు రాజకీయంగా ఎత్తుగడలు వేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆరితేరిన చంద్రబాబు ఇప్పుడు నుయ్యిలో పడ్ద ఏనుగులా ఘీం కారాలు పెడుతున్నాడని అందరు అనుకుంటున్నారట. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయ పీఠం బాబోరిని వదిలి  వైసీపీ ని వరించిందో. బాబుగారి బలం అంతా దిగిపోయింది. అప్పటివరకు పదవే లోకంగా, బ్రతుకుతున్న ఆయన కళ్లకు ఒక్క సారిగా చీకటి ఆవహించింది. దీనికి తోడు చేసుకున్న పాపాలు వదిలిపెట్టవు అన్నట్లుగా, జగన్ సీయం అవగానే అతనికి బాబు చేసిన అవమానాలు అన్ని కళ్ల ముందు మెదిలాయి.

 

 

అంతే అప్పటి వరకు గాల్లో తేలుకుంటూ రాజకీయమే లోకంగా బ్రతుకుతున్న  ఆయన కలలు ఒక్క సారిగా కూలిపోయాయి. పాపం ఆయన ఊహల్లో లోకం తెలియని అమాయకుడని పేరు తెచ్చుకున్న లోకేశం గారికి లోక జ్ఞానం తెలిసేలా చేసి, తన తదుపరి వారసత్వ సంపదగా రాజకీయ భవిష్యత్తును అందించాలని ఎన్ని కలలు కన్నాడు. అందుకోసం ఎక్కడో ఉద్యోగం చేసుకుంటు, ఉన్న బిజినెస్‌లు చూసుకుంటూ, లోకం తెలియని అమాయకుడిగా, రాజకీయ బురదను అంటించు కోకుండా, తన మానాన తాను బ్రతుకుతున్న లోకేశం గారిని వెంటేసుకుని రాజకీయ పాఠాలు నేర్పుదామని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. పడరాని పాట్లు పడ్డాడు.. ఈ ప్రయత్నంలో చివరికి లోకేశ్ చేతిలో ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పుడు లేకుండా చేసాడు.

 

 

ఇకపోతే ఇప్పుడు వినిపిస్తు ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే అసలు ఈ ఎమ్మెల్సీ వ్యవస్దను కేవలం లోకేశ్ ఉన్నాడు అనే ఒకే ఒక కారణంతో రద్దు చేసారు అని అనుకుంటున్నారట. ఇకపోతే తాజాగ జగన్ తీసుకున్న మంత్రి మండలి రద్దు విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ఆ తీర్మానం ను కేంద్ర హోం శాఖకు పంపడం జరిగింది. తాము చేసిన బిల్లులను అడ్డుకుంటుంది అనే ఒక్క ఉద్దేశ్యంతోనే జగన్‌ మండలిని రద్దు చేస్తున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఇదే కాకుండా ఎక్కువగా తెలుగు దేశం పార్టీకి చెందిన సభ్యులు ఉండటంతో పాటు లోకేష్‌ కూడా మండలి సభ్యుడిగా ఉన్నాడు.

 

 

బాబు గారి రాజకీయ వారసుడిగా వచ్చినా, అందరిలో ముద్దపప్పుగా మిగిలాడు. ఆయన చేసిన రాజకీయం ఏమి లేదు. అయిన నారా లోకేష్‌ మండలి సభ్యుడిగా ఉండటం జగన్‌కు నచ్చలేదు అని, ఆయన్ను పదవి లేకుండా చేయాలనే పట్టుదలతోనే జగన్‌ మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఇదే కాకుండా ఒకవేళ లోకేష్‌ ఎమ్మెల్సీ కాకుంటే ఖచ్చితంగా మండలి కొనసాగే అవకాశాలు ఉండేవని అంటున్నారు కొందరు. ఏది ఏమైనా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి  ఇంకా రాజకీయ నిరుద్యోగాన్ని పెంచడమే కాదు. తాను కూడా రాజకీయ నిరుద్యోగిగా మారిపోయాడు. పాపం బ్యాడ్ లక్ అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: