ఏంటండీ.. ఈ అరాచకం? టీడీపీ మళ్ళి ఎమ్మెల్యేలను కొంటుందట.. అదికూడా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలను కొంటున్నాడట చంద్రబాబు.. ఏంటి ఈ అరాచకం? ఏంటి కామెడీ? ఏంటి ఈ జోకు? అని మీ అందరికి సందేహం రావచ్చు.. అవును ఇది పెద్ద కామెడీ గాసిప్.. నవ్వకుండా ఈ వ్యక్తి ఉండలేరు!

 

అంత కామెడీ కథనం ఇది.. అందులో ఏముంది అంటే.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని.. దానిపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అని.. అంతేకాదు.. మండలి రద్దు కారణంగా కాళీ అయినా వైసీపీ ఎమ్మెల్సీలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు అని.. 

 

అంతేకాదు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న కొందరు వైసీపీ నేతలు భవిష్యత్తులో మంత్రి పదవులు దక్కుతాయనే ఆశతో ఉన్నారు అని.. వారికీ కూడా ఇప్పుడు మండలి రద్దు షాక్ ఇచ్చింది అని.. అంతేకాకుండా.. నిన్న మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కి రాలేదని.. 

 

వారిని క్యాష్ చేసుకొని.. చంద్రబాబు కొనాలని చూస్తున్నట్టు ఆ పత్రిక రాసింది.. అంతేకాదు.. త్వరలోనే వైసీపీ ఖాళీ అవుతుంది అని.. అందుకు చంద్రబాబు లోపల ఎం చెయ్యాలో అన్ని చేస్తున్నాడు అని ఓ పత్రిక కథనం రాసింది. అయితే.. ఆ పత్రిక ఇలాంటి ఫేక్ కథనాలు రాయడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. 

 

అయితే.. రాజకీయ విశ్లేషకుల నుండి నెటిజన్ల వరుకు అందరికి తెలుసు.. సీఎం జగన్ ఒక్కసారి గేట్ తిస్తె టీడీపీలో ఉండే 23 మంది ఎమ్మెల్యేలలో 17మంది సర్రున వైసీపీలో చేరుతారని.. ఇప్పటికే వైసీపీలోకి ఎంటర్ అవ్వకపోయిన టీడీపీలోనే ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు వారి పార్టీకే వ్యతిరేకం అయ్యారు.. అలాంటి టీడీపీ పార్టీ ఖాళీ అవ్వడం కాకుండా వైసీపీ ఖాళీ అవుతుంది అనడం ఎంత ఆశ్చర్యకరమే చెప్పాల్సిన అవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: