పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్.. సినిమాలలో ఉన్నంత వరుకు పవర్ స్టార్ ఏ.. ఇప్పుడే పవర్ లెస్ స్టార్ అయ్యాడు ఈ పవన్ కళ్యాణ్. రాజకీయాలలోకి వచ్చి ఎం చేశాడు అంటే.. పవర్ లేని పార్టీకి మద్దతు ఇచ్చి 2014లో ఓ పవర్ లెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి.. ప్యాకేజి తీసుకొని అప్పుడంతా అరవకుండా కరెక్టుగా ఎన్నికల సమయంలో పార్టీని తిట్టాడు.. 

 

అంతేకాదు.. ఎన్నికల ముందు ఏ పార్టీని అయితే ఘోరంగా.. అరాచకంగా తిట్టాడో... ఎన్నికలు ముగిసాక 8 నెలల్లో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న అంత మాత్రా బీజేపీ ఎజెండాను భుజాలపై వేసుకొని మొయ్యాల్సిన అవసరం ఏమైనా ఉందా? 

 

అస్సలు లేదు.. కానీ.. జనసేన ఇప్పుడు భుజాలపై వేసుకొని మోస్తున్నాడు. జనసేన పార్టీ ఈ మేడ్ బీజేపీతో ఎటువంటి షరతులు లేకుండా పొత్తు పెట్టుకుంది. ఈ మేరకు బీజేపీ, జనసేన పార్టీలు కలిశాయనీ, బీజేపీకి జనసేన మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చిందనీ బీజేపీ నేతలు చెప్పుకున్నారు.

 

అయితే మరో వైపు.. అమరావతి అంశంపై బీజేపీతో కలిసి జనసేన నడుస్తుంది అని.. రాష్టానికి ఒకే రాజధాని ఉండాలి అనే జనసేన ఆలోచనకు బీజేపీ మద్దతు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు.. అయితే నిజానికి జనసేన ఆలోచన ఒకటి ఉంటె.. బీజో ఎజెండా మరొకటి ఉంది.. అమరావతి విషయంలో జనసేనకు బీజేపీ ఏమాత్రం కలిసి నడవలేకపోతున్నాయి. 

 

అంతేకాదు.. జనసేనకు అమరావతి అంశమే సరిగ్గా తెలియదు.. అలాంటిది.. దేశం అంత భిన్నాభిప్రాయాలతో ఉన్న ఎన్‌ఆర్‌సి, సీఏఏ విషయాలపై అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పాలంటే బీజేపీ ఎజెండాను భుజాలపై ఎత్తుకొని మోస్తున్నాడు. సీఏఏ కావొచ్చు, ఎన్‌ఆర్‌సి కావొచ్చు.. ఎన్‌పిఆర్‌ కావొచ్చు.. ఇవి భారత పౌరులకు వ్యతిరేకంగా కాదని జనసేన పార్టీ చెబుతోంది.

 

ఇంత వివాదాస్పద అంశాన్ని జనసేన భుజానికెత్తుకోవడం జనసైనికులకు ఏమాత్రం నచ్చడంలేదు. 'మేం బీజేపీకి మద్దతిస్తున్నాం..' అంటే అయిపోయేది.. ఇలా బీజేపీ ఎజెండాను భుజానికి ఎత్తుకోవడం ఏమాత్రం మంచిది కాదు.. అసలు ఈ అవసరం ఎందుకు వచ్చింది అని జనసైనికులు మండిపడుతున్నారట.. ఏది ఏమైనా జనసేనకు ఒక పని అప్పగిస్తే దానికి మించి చేస్తాడు అని చెప్పడానికి ఇది ఒక చిక్కటి ఉదాహరణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: