బండ్ల గ‌ణేష్‌..సినీ రంగంలో క‌మెడీయ‌న్‌గా సుప‌రిచితుడు. అనంత‌రం పొలిటిక‌ల్ కెరీర్ ఎంచుకున్న ఆయ‌న తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన బండ్ల మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే, అలాగే మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా? అనేలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి తాజాగా ఓ ట్వీట్ చేశారు. 

 

పవన్‌కల్యాణ్‌ను 'దేవుడు' అని అభివర్ణించి బండ్ల‌ గణేష్‌.. వన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత ఆ పార్టీలో జాయిన్ అవుతారని అనుకోగా....పవన్ పార్టీలో కాకుండా అయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి షాక్ ఇచ్చారు.  అయితే, కాంగ్రెస్‌లో రాణించలేకపోయారు. స‌వాల్ విసిరి న‌వ్వుల పాల‌య్యారు. దీనిపై ఆ స‌మ‌యంలో మీడియాతో స్పందిస్తూ...గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యలను పేర్కొంటూ... కోపంలో చాలా మంది చాలా అంటారు. అవన్నీ అవుతాయా? మా పార్టీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి అలా అన్నాను. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. ఇదే సందర్భలో మరి ఇప్పుడు ఏం చేయమంటారు? గొంతు కోసుకోమంటారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారన్న వార్తలపై స్పందించిన ఆయన... తాను అజ్ఞాతంలో ఉన్నానని అంటున్నారు. నేనేం అజ్ఞాతంలో లేను. మేం ఊహించని విధంగా మా పార్టీ ఓడిపోయింది కాబట్టి మానసికంగా బాధతో ఉన్నాం. ఇలాంటప్పుడు ఏం మాట్లాడతాంలే.. అందుకే కొంత కాలం మౌనంగా ఉండాలి అనుకున్నాం అని చెప్పుకొచ్చారు. కాగా, రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసిన ఆయ‌న  మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  

 

ఇలా ట్విస్టుల‌తో త‌న కెరీర్‌ను కొన‌సాగించిన బండ్ల గ‌ణేష్ తాజాగా పవన్ కళ్యాణ్‌కు చెందిన‌ ఓ ఫోటోను షేర్ చేశారు.  `నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను` అని ప‌వ‌న్ ఫోటోతో ముద్రించి ఉంది. అయితే, బండ్ల గణేష్ ఈ ఫోటోను ఎందుకు చేశార‌నేది ఆస‌క్తిని రేకెత్తించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: