తెలివి. ఇది మనిషిలో ఎంతగా ఉందంటే టన్నులు టన్నులుగా ఉంది. కానీ అవసరానికి మించి ఉంది. దీని వల్ల అప్పుడప్పుడు మేలు జరుగవచ్చు కానీ కీడే ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఇక ఈ సృష్టిలో మనిషికంటే తెలివైన ప్రాణి బహుశా ఏది లేదనే నమ్మకం మనుషుల్లో ఎక్కువగా నాటుకు పోయింది. ఒక రకంగా దీన్ని నిజం అని చెప్పలేం. అలాగని అబద్ధమని కొట్టిపారేయ లేము. ఎందుకంటే అడవిలో, కౄరమృగాల మధ్య  బ్రతకడం నేర్చుకున్న, మనిషి క్రమ క్రమంగా, సమాజాన్ని ఏర్పరచుకుని జనారణ్యంలో బ్రతకడం నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు జనాల మధ్య ఉంటున్న తనలోని కౄరమైన ఆలోచనలను వదల లేక పోతున్నాడు.

 

 

ఇకపోతే ఎప్పుడో చదివిన కధ. ఇద్దరు స్నేహితులు అడవి దారి గుండా వెళ్లుతుంటే ఒక పులి వారి కంటపడగా, అందులో ఒకడు చెట్టు ఎక్కి తన ప్రాణాలు కాపాడు కుంటాడు. మరొకతనికి, చెట్లు ఎక్కడం రాదు. అప్పుడు అపాయంలో ఉపాయంలా అక్కడే నేల పైన పడుకోని చచ్చినట్లుగా నటించి తన ప్రాణాలు కాపాడు కుంటాడు. పులి చెవిలో మల్లెపువ్వులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్న ఆ తెలివి తేటలను మెచ్చుకోని వారుండరు. అప్పుడే నిరూపించుకున్నాడు మనిషి, తాను పులికంటే కౄర స్వభావం కలవాడినని, అందుకే ఆ పులి కూడా ప్రాణాలతో ఉన్న తనను శవంగా భావించి వెళ్లిందని.

 

 

ఇక ఈ పాఠాన్ని చాలా బట్టి పట్టినట్లు ఉన్నాడు ఒక వ్యక్తి.  సరిగ్గా ఇలాంటి సంఘటనే అతనికి ఎదురైనప్పుడు. ఇతను కూడా ఆ పులి నెత్తిన టోపి పెట్టి తన ప్రాణాలను రక్షించుకున్నాడు. ఇక చూసే వారికి గుండెలు జారిపోయేలా ఉన్న ఈ ఘటన జరిగింది మహారాష్ట్రలోని భందారా జిల్లాలోని తుమ్సార్ ప్రాంతంలో...  ఓ పులి పొలాల్లో అలజడి సృష్టించింది. దీన్ని చూసిన వారు భయపడి పారిపోతుండగా అది ఒక వ్యక్తికి దగ్గరగా రావడంతో అతను  ఏ మాత్రం భయపడకుండా పారిపోకుండా అక్కడే పడుకునిపోయాడు. అతనికి దగ్గరగా వచ్చిన ఆ పులి అతన్ని వాసన చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: