ఉదయం 9 గంటల వరకు పడుకునే వ్యక్తికి సూర్యోదయ సమయంలో కిలకిలా రావాలు చేసే పక్షుల సందడిని ఉషోదయ కిరణాలను ఎంజాయ్ చేయలేడు. ప్రతి వ్యక్తి ఇప్పుడు తాను జీవిస్తున్న స్థాయికన్నా అంతకన్నా మంచిగా ఎలా బతకాలో ఆలోచించే వ్యక్తి దగ్గర మాత్రమే ధనం వచ్చి చేరుతుంది.

అందుకే ‘నా కాంక్షే విజయం కృష్ణ’ అని అన్నాడు అర్జునుడు. సాధారణంగా ప్రతి వ్యక్తికి ఓటమి పట్ల ఎలా భయం ఉంటుందో గెలుపు పట్ల కూడ భయం అలాగే వెంటాడుతుంది. అయితే ఏవ్యక్తి తనకు గెలుపు వద్దు అని కలలో కూడ అనుకోడు. గెలుపు కు ప్రత్యామ్నాయం గా ఉండే పదం కూడ లేదు.

భగవంతుడు మనిషిని సృష్టించి భూమి మీదకు పంపుతున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఐదు సూత్రాలను చెపుతాడు అంటూ ఆధ్యాత్మిక వాదులు చెపుతూ ఉంటారు. ఆ ఐదు సూత్రాలను అనుసరిస్తే గెలుపు వశం అవ్వడంతో ఐశ్వర్యం కూడ గెలుపుతోనే వస్తుంది. ఎప్పుడూ తెలివైన వాడి ఆలోచనలలో భాగం పంచుకుంటూ వీలైనంత వరకు అతడితోనే ఉంటూ ఎప్పటికప్పుడు నిరంతరం మనకు మనం చెక్కుకుంటూ సూటిగా బ్రతకడానికి ప్రయత్నించే వ్యక్తి దగ్గర మాత్రమే డబ్బు వచ్చి చేరుతుంది అని అంటారు.

అంతేకాదు మన తప్పులను ఎప్పటికప్పుడు తుడిచి పెట్టుకునే రబ్బరు లాంటి పరికరాన్ని మన శరీరంలో మానసికంగా పెట్టుకోగల వ్యక్తి దగ్గర మాత్రమే విజయం – ఐశ్వర్యం లభిస్తాయి. అదేవిధంగా మనం బయటకు ఎలా కనపడుతున్నాము అన్నది ముఖ్యం కాదు మన లోపల ఏముందో తెలుసుకోగల వ్యక్తి దగ్గర మాత్రమే విజయం లో ఐశ్వర్యం పొందగలడు. మనం ఎంతమంది మధ్య ఉన్నా మన వ్యక్తిత్వాన్ని వదులు కోకుండా మన ముద్రతో ప్రభావితం చేయగలిగినప్పుడు మాత్రమే మనం వద్దు అనుకున్నా డబ్బు వచ్చి చేరుతుంది. ఈ ఐదు సూత్రాలను అన్వయించుకునే ఏ వ్యక్తి దగ్గర అయినా ఎన్ని కాలాలు మారిన డబ్బు వచ్చి చేరుతుందని మనీ విశ్లేషకుల భావన.. 

మరింత సమాచారం తెలుసుకోండి: