నందిగామ ప్రభుత్వ వైద్యురాలి ప్రవర్తనపై ఆగ్రహం. వైద్య సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్న పాల్గుణ దేవి. సిబ్బంది ఫిర్యాదుతో కదిలిన టీఎన్జీవోల బృందం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు పాల్గుణ దేవి కిందిస్థాయి సిబ్బంది పై దురుసు ప్రవర్తన తీరుపై కిందిస్థాయి సిబ్బంది అందోళనకు గురవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా సిబ్బందితో వాగ్వాదం చేస్తున్నట్టు బాధిత సిబ్బంది ఫిర్యాదులు చేస్తున్నారు. 


ఆసుపత్రి సిబ్బంది విసిగి వేసారి
టీఎన్జీవో అధ్యక్షుడు ఎం. వెంకట్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులకు ఫిర్యాదు చేయగా.. వారు స్పందించారు. ఈరోజు ఆసుపత్రికి టీఎన్జీవో బృందం వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా కాన్పు కేసులు తెస్తే వద్దు అంటూ షాదనగర్ లేదా హైదరాబాద్ పంపండి అంటూ రోగుల పట్ల దురుసుగా ప్రవర్టిస్తున్నారంటూ బాధితులు పేర్కొన్నారు. గర్భిణీల వెనకాల పెద్ద ఆసుపత్రికి విధి నిర్వహణలో ఆశ వర్కర్లు వెళ్తే గైర్హాజరు వేస్తోందని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్న వైద్యురాలి తీరును వారు తప్పులు పట్టారు.

ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో మరియు జిల్లా నాయకుల పిలుపు తో కదిలిన టిఎన్జీఓ షాద్ నగర్ నియోజకవర్గ యూనిట్ కు అనేక సమస్యలు బాధితులు తెలిపారు. వీటిపై టీఎన్జీవో బృందం సమస్యలు పరిష్కారం చేసేందుకు డాక్టర్ పాల్గుణ దేవిని అడుగుతుంటే ఆమె మధ్యలోనే లేచి వెల్లిపోయారని టీఎన్జీవో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అక్కడ వేచి ఉన్న గర్భిణులను రోగులను చూడకుండా మధ్యలోనే వెళ్లిపోయిన డాక్టర్ పాల్గుణ దేవి ప్రవర్తన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వైద్యురాలు  మాకొద్దు అంటున్న నందిగామ పిహెచ్ సి సిబ్బంది వైనం పై రోగుల నుంచి సిబ్బంది వరకు ఆ వైద్యురాలిపై విమర్శలే వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఫిర్యాదు చేయుటకు వెళ్లిన సిబ్బంది వెళ్లారని టీఎన్జీవో నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నేతలు విష్ణు వర్ధన్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రాజు, నరేందర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: