’రాబోయే రోజుల్లో  జగన్మోహన్ రెడ్డికి శాసనమండలి సమావేశాలో సినిమా చూపిస్తాం’ ..

ఇది తెలుగుదేశంపార్టీ శాసనమండలి సభ్యులు జగన్ ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు. మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత టిడిపి మండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లేండి. మండలి రద్దు పై నోటికొచ్చినట్లు మాట్లాడి జగన్ పై తమ అక్కసును తీర్చుకున్నారు.  శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయటంతో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు.

 

ఇదే విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ జగన్ కు సినిమా చూపిస్తామని హెచ్చరించటమే ఆశ్చర్యంగా ఉంది. మండలి రద్దు విషయంలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, లోకేష్ లాంటి వాళ్ళు జగన్ ను సవాలు చేసి రెచ్చగొడితే ఏమైందో అందరికీ అనుభవంలోకి వచ్చింది. పద్దతి ప్రకారం శాసనమండలిలో బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అదీ కాదంటే సవరణలను కూడా ప్రతిపాదించవచ్చు.

 

కానీ అవేమీ చేయకుండా సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపతున్నట్లు ఛైర్మన్ తో ప్రకటింపచేయటంతోనే టిడిపి శాడిజం బయటపడింది. సెలక్ట్ కమిటికి పంపాలనే నోటీసును టిడిపి  గడువులోపు ఇవ్వలేదు.  ఛైర్మన్ కు అసలు విచక్షాణాధికారమే లేదు. లేని అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునేట్లుగా ఛైర్మన్ ను చంద్రబాబునాయుడు, యనమలే తప్పుదోవ పట్టించారంటూ వైసిపి సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

నిజానికి తొండాటతో  మండలిలో జగన్ ను ఇబ్బంది పెట్టగలిగారు కానీ ఫెయిల్ గేమ్ తో కాదు. ఫెయిర్ గేమ్ జరుగుతున్న అసెంబ్లీలో జగన్ అండ్  కో చంద్రబాబుకు సినిమా చూపిస్తున్నారు. అందుకు భయపడే చివరకు మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టే రోజున చంద్రబాబు అండ్ కో అసలు సమావేశాలకే హాజరుకాలేదు.

 

సమావేశానికి హాజరై తాము చెప్పదలచుకున్నది చెప్పటానికి కూడా భయపడ్డారంటేనే జగన్ అండ్ కో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఏ స్ధాయిలో సినిమా చూపుతున్నారో అర్ధమైపోతోంది. ఇలాంటి వాళ్ళు మండలిలో జగన్ కు సినిమా చూపిస్తామని హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడినందుకే మొన్నటి ఎన్నికల్లో పార్టీ దాదాపు నేలమట్టమైపోయింది. అయినా వాళ్ళకు జ్ఞానోదయం కాలేదంటే ఎవరూ ఏమి చేయలేరు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: