దేశ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది. ఈఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రేవేశపెట్టనున్నారు. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్ల తగ్గింపు ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి రేట్ల తగ్గింపును 1955-56 లో ప్రవేశపెట్టారు. పెళ్లైన వారికి ఒక ట్యాక్స్‌ను, పెళ్లికాని వారికి మరో ట్యాక్స్‌ను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో సంపద పన్ను‌ను ప్రవేశపెట్టారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌ను 5 అణాల నుంచి 4 అణాలకు తగ్గించారు.

 


‘కమిషన్ సిఫార్సు మేరకు పెళ్లైన వారికి పెళ్లి కానివారికి పన్ను విధిస్తున్నాం. పెళ్లైన వారికి ప్రస్తుతమున్న రూ.1,500 పన్ను మినహాయింపు పరిమితిని రూ.2,000కు పెంచుతున్నాం. పెళ్లికాని వారికి మినహాయింపును రూ.1,000కు తగ్గిస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వానికి రూ.90 లక్షల ఆదాయం తగ్గుతుంది’ అని ఆనాటి బడ్జెట్ ప్రసంగంలో సీడీ దేశ్‌ముఖ్ తెలిపారు, రూ.2,000 వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2,001 నుంచి రూ.5,000 వరకు ట్యాక్స్ స్లాబ్‌కు 9 దమ్మిడీలు, రూ.5,001 నుంచి రూ.7,500 స్లాబ్‌కు ఒక అణా 9 దమ్మిడీలు, రూ.7,501 నుంచి రూ.10 వేల స్లాబ్‌కు 2 అణాల 3 దమ్మిడీలు, రూ.10,001 నుంచి రూ.15 వేల స్లాబ్‌కు 3 అణాల 3 దమ్మిడీలు, రూ.15,001 నుంచి ఆపైన స్లాబ్‌లో ఉన్న వారికి 4 అణాల పన్ను విధించారు.



పెళ్లి కాని వారికి.. రూ.1,000 వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.1,001 నుంచి రూ.5,000 వరకు స్లాబ్‌కు 9 దమ్మిడీలు, రూ.5,001 నుంచి రూ.7,500 ట్యాక్స్ స్లాబ్‌కు 1 అణా 9 దమ్మిడీలు, రూ.7,501 నుంచి రూ.10 వేల స్లాబ్‌కు 2 ఆణాల 3 దమ్మిడీలు, రూ.10,001 నుంచి రూ.15 వేల స్లాబ్‌కు 3 అణాల 3 దమ్మిడీలు, రూ.15,001 నుంచి ఆపైన ఆదాయం ఉన్న వారికి 4 అణాల పన్ను విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: