కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ఒక పండ్ల వ్యాపారికి అందించింది. పండ్ల వ్యాపారికి పద్మశ్రీ అవార్డు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా...? కానీ ఆ పండ్ల వ్యాపారి గొప్ప మనస్సు గురించి తెలిస్తే మాత్రం అతను పద్మశ్రీ అవార్డుకు అర్హుడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. పూర్తి వివరాలలోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని న్యూపదపు అన్న అనే గ్రామంలో హరేకలా హజబ్బా అనే పేద వ్యాపారి నివశిస్తున్నాడు.             
 
ప్రతిరోజు హజబ్బా నారింజ పండ్ల వ్యాపారం చేసి గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు. గతంలో హజబ్బా నివశించే గ్రామానికి ఒక విదేశీ జంట వచ్చింది. ఆ జంట ఒక అడ్రస్ చూపించి ఆ అడ్రస్ ఎక్కడో చెప్పమని హజబ్బాను అడగగా చదువుకోలేకపోవటం వలన హజబ్బా ఆ అడ్రస్ ను చెప్పలేకపోయాడు. తాను చదువుకోకపోవడం వలన అడ్రస్ చెప్పలేకపోయాయని హజబ్బా చాలా బాధ పడ్డాడు. 
 
ఆ తరువాత తన గ్రామంలోని పేద పిల్లలకు చదువు చెప్పించాలని హజబ్బా నిర్ణయం తీసుకున్నాడు. ఒక చిన్నపాటి స్కూలును గత పదేళ్లుగా నిర్వహిస్తూ పేద పిల్లలు చదువుకునేలా చేస్తున్నాడు. హజబ్బా గ్రామంలోని ఒక మసీదులో ఈ స్కూల్ ను నిర్వహిస్తున్నాడు. చదువు పట్ల ఉన్న ఆసక్తితో తనకొచ్చే సంపాదన తక్కువైనప్పటికీ హజబ్బా ఈ నిర్ణయం తీసుకున్నాడు. 
 
హరేకలా హజబ్బాకు స్థానిక భాష తప్ప మరో భాష రాదు. తుళు భాష మాత్రమే హజబ్బాకు వచ్చు. పేద పిల్లలకు చదువు నేర్పించటానికి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్న హజబ్బా కృషిని గుర్తించి ప్రభుత్వం హజబ్బాను పద్మశ్రీ అవాఅర్డుతో సత్కరించింది. అధికారులు హజబ్బా కు పద్మశ్రీ అవార్డు వచ్చినట్టు చెప్పటంతో హజబ్బా ఎంతో ఆనంద పడ్డాడని ఇది కలా...? నిజమా...? అని కొంతసేపు ఆశ్చర్యపోయాడని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: