అయ్యబాబోయ్.. మీరు చెప్పిందా నిజామా అండి.. అంత తక్కువ ధరకు టీవీ వస్తుందా? అవును.. డిస్కౌంట్ అంటే అంతేమరి. మాములుగా మనం ఆఫర్లు చూసి ఉంటాం.. కానీ ఇలాంటి అదిరిపోయే ఆఫర్లను ఎప్పుడు ఎక్కడ చూసి ఉండము.. ఎందుకు అంటే అంత అద్భుతమైన ఆఫర్లు ఇవి. 

 

మాములుగా ఏదైనా పండుగా వస్తేనో లేదా మరేదైనా స్పెషల్ అయితేనో ఈ ఆఫర్లు ఇస్తారు.. ఆలా పండుగలు వచ్చినప్పుడు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు కూడా బాగా ఆఫర్లు ఇస్తాయి. అప్పుడు నిజంగానే 15 వెలది కూడా 5 వేలకు వచ్చేస్తుంది. ఆలా సామాన్యులకు ఈకామర్స్ సైట్స్ బాగా ఆఫర్లు ఇస్తాయి. అందుకే ఏదైనా కొనాలి అంటే అగు ఫ్లిప్ కార్ట్ వాడు సేల్ పెడుతారు అని అంటుంటారు ఈ తారం వారు. 

 

అయితే ఓ చోటా కూడా భారీ ఆఫర్ పెట్టారు.. ఆ ఆఫర్ చుసిన జనాలు కూడా ఆ షాప్ కి పరుగెత్తుకు పోయారు.. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఆ ఆఫర్ లేదు అని.. ఆ షాపు చేసిన చిన్న తప్పు అని . అయితే ఇది అంత జరిగింది.. ఫ్రెంచ్ రిటైల్ స్టోర్ ఇటీవల టీవీలపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

 

ఆ ఆఫర్ ఏంటి అంటే.. టీవీ ధర 399 యూరోలు ఉన్నదీ 30.99 యూరోలుగా పెట్టింది.. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం రూ.31,500 టీవీని కేవలం రూ.2,450 పెట్టారు. అంత తక్కువకు పెడితే ఎవరైనా టెంప్ట్ అవ్వకుండా ఉంటారా ? పాపం అలానే అయ్యి వెళ్తే అది తప్పు అని.. అయితే కస్టమర్లు మాత్రం.. మాకు ఇస్తేనే వెళ్తాము లేకుంటే కూల్చేస్తాం అని అన్నారు. 

 

దీంతో ఆ మార్కెట్ యాజమాన్యం ఏ మాత్రం తగ్గకుండా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి కస్టమర్లను అందరిని వెనక్కు పంపేశారు. కాగా ఈ ఘటనను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: