మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయ ప్రత్యర్థులే కాదు ... కుటుంబ సభ్యులు కూడా  సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరడం హాట్ టాపిక్ మారింది . రాష్ట్రం   లో   వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతున్న తరుణం లో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో పని చేసే సిట్ విచారణ కాకుండా , కుటుంబ సభ్యులు సిబిఐ విచారణ కోరడం చర్చనీయాంశంగా  మారింది .  సిట్ ద్వారా తమకు న్యాయం జరగదని వివేకా కుటుంబ సభ్యులు భావిస్తున్నారా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది . వివేకా హత్య కేసును సిబిఐ కి అప్పగించాలన్న కుటుంబ సభ్యుల వాదన ను ప్రభుత్వం తోసిపుచ్చుతూ , విచారణ చివరిదశ కు చేరిందని పేర్కొనడం కూడా ఆసక్తికరంగా మారింది .

 

విచారణ చివరి దశకు చేరుకున్న తరుణం లో వివేకా హత్య కేసు విచారణ సిబిఐ కి  అప్పగించాలని ఆయన కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తకమానదు  . ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్సీ , టీడీపీ నాయకుడు బీటెక్ రవి , మాజీ మంత్రి , బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి లు హైకోర్టును ఆశ్రయించిన విషయంతెల్సిందే . వివేకానందరెడ్డి హత్యకేసు ను కుటుంబ సభ్యులతో పాటు , ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కూడా సిబిఐ విచారణకు అప్పగించాలని కోరుతున్న నేపధ్యం లో హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాఫిక్ గా మారింది . మాజీ మంత్రి వివేకానందరెడ్డి ని ఆయన ఇంట్లోనే గత ఏడాది మార్చి 14 వతేదీన ఇంట్లోనే దుండగులు దారుణంగా హత్య చేసిన విషయం తెల్సిందే . వివేకా హత్య సమయం లో రాష్ట్రం లో టీడీపీ ప్రభుత్వం అధికారం లో ఉండడం తో , అధికార పార్టీ ప్రోద్భలంతోనే వివేకా హత్య జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి .

 

ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక పోలీసు దర్యాప్తు  బృందం (సిట్ ) ను ఏర్పాటు చేసింది . అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం లోకి రావడం తో వివేకా హత్య నిగ్గు తేల్చేందుకు జగన్ సర్కార్ మరొక సిట్ బృందం ఏర్పాటు చేసింది . సిట్ బృందం ఇప్పటికే పలువుర్ని ప్రశ్నించింది . అయితే సునీత పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది . ఇప్పటికే కేసు చివరిదశకు చేరుకుందని ప్రభుత్వం హైకోర్టు కు విన్నవించిన నేపధ్యం లో , కోర్టు , సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా ?, లేకపోతే  సిట్ నే త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశిస్తుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: