ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు వాహనదారుల నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదాలు జరిగితే కొన్నిసార్లు మాత్రం పొరపాట్ల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు యూసఫ్ గూడ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువతి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
ఈ ప్రమాదంలో సాయి దీపికా రెడ్డి అనే యువతి ఘటనాస్థలంలొనే మృతి చెందింది. సాయి దీపిక జూబ్లీహిల్స్ లోని అపర్ణ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తోంది. తన స్కూటీపై పంజాగుట్ట నుండి యూసఫ్ గూడ వెళుతున్న సాయి దీపికా రెడ్డి స్కూటీ ఆంధ్ర బ్యాంక్ దగ్గర  అదుపు తప్పటంతో స్కూటీ అదే దారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. స్కూటీతో పాటు యువతి బస్సు వెనక చక్రాల కింద పడటంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. 
 
ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదాన్ని చూసి బస్సులోని ప్రయాణికులు, స్థానికులు కలత చెందారు. వేగంగా స్కూటీ నడపడం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. స్కూటీని బ్యాలన్స్ చేయలేకపోవటంతో స్కూటీ అదుపు తప్పిందని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు బస్ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. బస్సు కొండాపూర్ డిపోకు చెందినది అని తెలుస్తోంది. యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైనా జరుగుతున్న ప్రమాదాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సాయి దీపికా రెడ్డి మృతితో ఆమె పని చేస్తున్నసంస్థలో, ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: