తన తండ్రి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ. ఏపీ సీఎం జగన్ బాబాయి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్య కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలంటే సీబీఐకి అప్పగించాలని కోరారట. ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు వేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సోదరుని తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హత్య జరిగిన సమయంలో సీబీఐ విచారణ జరపాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారని.. ఆయన సీఎం అయిన తర్వాత ఎందుకు సిట్ వేశారో చెప్పాలన్నారు.

ఈ కేసుకు సంబంధించి అన్ని పార్టీలు సీబీఐ కావాలని కోరుతున్నాయని.. ఒకవేళ ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్‌కౌంటర్ చేసుకోవచ్చని.. సీబీఐ విచారణ కావాలన్నదే ప్రధాన డిమాండ్ అన్నారు. సీఎం జగన్ తో  పాటుగా వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆదినారాయణరెడ్డి. తప్పు ఉన్నవారిని తప్పకుండా శిక్షించాల్సిందేనని.. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసన్నారు.

ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచితే.. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.  కొద్ది రోజుల క్రితమే సిట్ ముందు హాజరైన ఆయన.. తాజాగా కోర్టుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. కొత్తగా నాలుగో పిటిషన్ వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ .

విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకి తెలిపిన ప్రభుత్వం.  నేడు ఇప్పటికే వేసిన పిటిషన్ల పై విచారణ ఉండగానే వివేకా కుమార్తె మరో పిటిషన్. అన్ని పిటిషన్లపై నేడు విచారించనున్న ధర్మాసనం. ప్రతివదులుగా సీబీఐ, ఏపీ హోం శాఖను చేర్చిన పిటీషినర్ సునీత.

మరింత సమాచారం తెలుసుకోండి: