జగన్మోహన్ రెడ్డి స్పీడు చూసి చంద్రబాబునాయుడుకు  షాక్ తగిలింది. సోమవారం రాత్రి శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిందో లేదో వెంటనే రాత్రికి రాత్రే తీర్మానం ఫైల్ ఢిల్లీకి వెళ్ళిపోయింది.  ముఖ్య కార్యదర్శి సంతకంతో సదరు ఫైల్ ఢిల్లీలోని కేంద్ర హోం శాఖతో పాటు ఎన్నికల కమీషన్ కు కూడా చేరిపోయింది.  దాంతో మండలి రద్దు విషయంలో జగన్ ఎంత స్పీడుగా ఉన్నాడో అందరికీ అర్ధమైపోయింది.  ఇంత స్పీడుగా ఫైల్ ఢిల్లీకి వెళుతుందని చంద్రబాబుతో పాటు ఎవరూ ఊహించినట్లు లేరు.

 

మండలి రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి చంద్రబాబు, టిడిపి నేతలు ఏదో ఓ విధంగా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. మండలి రద్దు అధికారం జగన్ కు లేదన్నారు. జగన్ అనుకున్నంత మాత్రాన మండలి రద్దు అయిపోతుందా ? అంటూ ఎగతాళి చేశారు. మండలి రద్దు అధికారం తనకు లేదని జగన్ కు తెలీదా ?  ప్రతిపాదనలు పంపటం వరకే రాష్ట్రప్రభుత్వం చేయగలిగిందన్న విషయాన్ని టిడిపి వాళ్ళు సిఎంకు చెప్పాల్సిన అవసరం లేదు.

 

అన్నీ తెలిసే మండలి రద్దుకు జగన్ డిసైడ్ అయ్యారు. తీర్మానం చేసిన తర్వాత  ఢిల్లీలో ఫాలో అప్ చేయాలన్న విషయం జగన్ కు తెలీకుండానే ఉంటుందా ?  ఏమిటో చంద్రబాబు, యనమల నోటికొచ్చినట్లు మాట్లాడటమే కానీ వాస్తవాలను గ్రహించటానికి ఇష్టపడటం లేదు. ఏ ప్రభుత్వమైనా ఢిల్లీకి ప్రతిపాదనలు పంపిన తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖతో ఫాల్ అప్ చేయకుండా విషయాన్ని గాలికొదిలేస్తుందా ?

 

మొదటి నుండి ఇటువంటి సొల్లు మాటలు మాట్లాడి మాట్లాడే జనాల ముందు టిడిపి నేతలు పలుచనైపోయారు. విషయం ఏదైనా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అజెండాగా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి విషయంలోను చంద్రబాబు అండ్ కో కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయినా వాళ్ళల్లో మార్పులు కనబడటం లేదు. మరి మండలి రద్దుతో అయినా చంద్రబాబు అండ్ కో లో మార్పు వస్తుందేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: