తనను నమ్ముకున్న వారి కోసం ఎంత కష్టమైనా భరించేందుకు కు ఉండే వ్యక్తిగా ఏపీ సీఎం జగన్ గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఇది అర్థం అవుతుంది. అయితే ప్రస్తుతం ఒకే జిల్లాలో సొంత పార్టీ నాయకులకు జగన్ కారణంగా తమ పదవులు పోగొట్టుకో పోతున్నారు. అయితే ఇది పార్టీకి ప్రభుత్వానికి, అలాగే ప్రజలకు కూడా మేలు చేసే అంశం కావడంతో వారు మౌనంగానే జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా గుంటూరు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్సి లు తమ పదవిని కోల్పోతున్నారు. 


శాసనమండలిని రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని కేంద్రానికి పంపించబోపోతున్నారు. పార్లమెంట్ ఆమోదం తెలిపితే రాష్ట్రం చేయగానే మండలి రద్దు అవుతుంది. దీనికి కొద్దిగా టైం పట్టినా ఫైనల్ గా రద్దు అవ్వడం అయితే ఖాయం అయ్యింది. ఎందుకంటే కేంద్ర అధికార పార్టీ బిజెపి కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా వార్తలు వినిపించిన నేపథ్యంలో జగన్ నిర్ణయం అమలు కాబోతున్నట్టే అర్ధం అవుతోంది.  ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సిగా ఉన్న వారు పదవిని కోల్పోతున్నారు. వైసీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న చాలామంది తమ పదవులను కోల్పోతున్నారు.


 పార్టీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకటరమణ తదితరులు ఈ లిస్టులో ఉండగా టీడీపీ నుంచి పదవులు కోల్పోయే వారిలో  కూడా కీలక వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక టీడీపీ భావి వారసుడిగా పేరుపొందిన లోకేష్ వంటి వారి రాజకీయ జీవితానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. అయితే వైసీపీ ఎంఎల్సీలు పదవులు కోల్పోయినా ప్రభుత్వం ఉంది కనుక ఏదో ఒక రకంగా వారికి న్యాయం జరుగుతుంది. వారికి ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతి పక్ష టీడీపీలో మాత్రం దీనిపై చాలా ఆందోళన నెలకొంది. ఇప్పుడు పదవులు కోల్పోయిన వారికి మళ్ళీ న్యాయం జరిగే అవకాశం లేదు. కేవలం పార్టీ పదవులతోనే సరిపెట్టుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: