అతను నిన్నటి వరకు ఒక సాధారణ కండక్టర్... ఈ మధ్య కాలంలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలలో విజయం సాధించటంతో అతను కలెక్టర్ కాబోతున్నాడు. కర్ణాటకకు చెందిన మధు తన కృషితో, పట్టుదలతో జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అన్ని వసతులు ఉన్నవారు పరీక్షలలో విజయం సాధించడం కొంత సులభమే. కానీ ఏ వసతులు లేనివారు ఉన్నత స్థానాలను చేరుకోవటంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి. 
 
కానీ మధు మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి తను అనుకున్నది సాధించాడు. పూర్తి వివరాలలోకి వెళితే మధు కుటుంబ సభ్యులందరూ నిరక్షరాస్యులే. మధు మాత్రమే అతని కుటుంబంలో ఉన్నత చదువులు చదువుకున్నాడు. బీఎంటీసీలో బస్ కండక్టర్ గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్ కావాలన్న తన కల కోసం కృషి చేశాడు. 
 
రోజుకు ఐదు గంటల పాటు కలెక్టర్ కావాలనే తన కల కోసం మధు కృషి చేసేవారు. ప్రిలిమినరీ పరీక్షలు కన్నడ భాషలో రాసి క్వాలిఫై అయిన మధు మెయిన్ పరీక్షలు మాత్రం ఇంగ్లీష్ లో రాశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 19 సంవత్సరాల వయస్సులో కండక్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్న మధు స్వతంత్రంగా సివిల్స్ కు ప్రిపేరై పరీక్షల్లో విజయం సాధించారు. 
 
రోజుకు ఎనిమిది గంటలు బస్సులో పని చేసి చదువుకోసం ఐదు గంటలు కేటాయించడం అంత సులభం కాదని మధు చెబుతారు. కండక్టర్ గా ఉద్యోగంలో చేరినా కలను నెరవేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నానని ఈ దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని కానీ ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగానని మధు చెప్పారు. మార్చి నెల 25వ తేదీన 
ఇంటర్వ్యూకు హాజరు కాబోతున్నానని చెప్పారు. మధు ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని మనసారా కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: