కదలిరండి  టెలుగు దేశ కార్యకర్తలారా  ... త్యాగాలకు వెనుతీయని దేశ భక్తులారా ... అంటూ వొళ్ళు జలదరించేలా పెద్ద మైక్ సౌండ్ పార్టీ ఆఫీసులో పెడితే మళ్ళీ ఏదో ఎలక్షన్ వస్తుందేమో అందుకే ఇప్పటి నుంచే ట్రైల్ వేస్తున్నారేమో అని విన్నవారంతా అనుకుంటున్నారు. కానీ లోపల జరుగుతున్న సంగతి మాత్రం వేరే అని ఈ వెర్రి జనానికి తెలియదు కదా ! లోపల నుంచి పెద్ద సౌండ్ తో మారుమోగిన పాట ఒక్కసారిగా ఆగింది. ఏంటా అని లోపాలకి ఓ లుక్కు వేసుకున్న ... అక్కడ పార్టీ నాయకులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కరి ముఖాల్లోనూ ఆనందం లేదు. అందరి ముఖాల్లో ఏడుపు ఒక్కటే తక్కువ. అప్పుడు 40 ఇయర్స్ పెద్ద మనిషి మైకు అందుకున్నాడు.

 

ఏంటి తమాషా చేస్తున్నాడా ఆ సీఎం ...? ఏమనుకుంటున్నాడు ...? నా రాజకీయ జీవితంలో ఇటువంటి మనిషిని నేను చూడలేదు. నేను నలభైఏళ్ళల్లో చేయలేని ఎన్నో పనులను కొన్ని నెలల్లోనే చేసేస్తే పోన్లే పాపం అని వదిలేసాను. కానీ ఇప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం పోగొడతాడా ఎంత ధైర్యం ...? అని ఆ పెద్ద మనిషి అనగానే ఒక్కసారిగా ఆ మీటింగ్ కి వచ్చిన పచ్చ చొక్కా నాయకులంతా ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుంటూ ... ఏంట్రా బాబు మన అందరి ఉద్యోగాలు పోతాయని బాధపడడంలేదా ? వాళ్ళ అబ్బాయి ఉద్యోగం పోతుందని బాధపడుతున్నాడా ? ఓర్నీ అనుకుంటూ ఆయన చెప్పేది వింటున్నారు. 

 

పోతే పోనివ్వండి ... మీరంతా అధైర్యపడొద్దు మీ వెనుక నేను ఉన్నాను. పార్టీ ఉంది. మీరంతా త్యాగాలకు సిద్ధంగా ఉండండి. అన్నట్టు రేపు మీ అందరికి సన్మానం కూడా చేయబోతున్న అంటూ చెప్పాడు. మా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి అని మేము బాధపడుతుంటే ఏంట్రా బాబు ఈ సన్మానం మాకు అనుకుంటూ భవిష్యత్తుని తలుచుకుంటూ బోరున ఏడుపు మొదలు పెట్టారు. ఉరుకోండమ్మా ... నా ఏడుపుతో పోల్చుకుంటే మీ ఏడుపు ఒక ఏడుపేనా ? నేను మీకు తెలియకుండా లోపల ఎంత ఏడుస్తున్నానో మీకేం తెలుసు....? 

 

అసలు నా కోడు వయస్సు ఉన్నోడు నన్ను గజగజలాడిస్తుంటే ఆ బాధ దిగమింగుకుని  నేను నా కొడుక్కు రాజకీయ అక్షరాలు దుద్దించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మీకేం తెలుసు..? నా రాజకీయ జీవితంలో నేను చేయనన్ని ఎన్నో మంచి పనులు ఆ సీఎం చేస్తుంటే నాకు ఎంత కడుపులో ఎంత మంట పుట్టిందో మీకేం తెలుసు..? నేను వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ ఇప్పుడు ఇలా అయిపోతుంటే... వెన్నుపోటుకి కత్తులు అందించిన వారి ఉద్యోగం కూడా పోతుంటే నేను ఇంకెంత బాధ పడుతున్నానో మీకేం తెలుసు ? అసలు ఇప్పుడు మీ పదవులు పోతే మిమ్మల్ని అందరిని నేను ఎలా భరించాలో అర్ధం కావడంలేదే...? అంటూ బాధపడిపోతుంటే సభలో ఉన్నవారిలో ఒకడు సార్ సార్ మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్ ...? ఏం చేద్దాం పిసుక్కోవడమే అంటూ లేచి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు ఆ పెద్దమనిషి.    
 

మరింత సమాచారం తెలుసుకోండి: