పాపం.. ఇప్పడు చంద్రబాబుకు రాజకీయంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పటికే ఉన్న 23 మంది ఎమ్మెల్సీల్లో ఇద్దరు జంప్ కొట్టేసారు. ఇక అటు చూస్తే మండలి మొత్తం క్లోజై.. కొడుకు ఫ్యూచర్ కు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితులు. జగన్ కొడుతున్న దెబ్బలతో ఆయన సతమతం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయనకు హైకోర్టు రూపంలో ఓ గుడ్ న్యూస్ లభించింది.

 

ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో తాజాగా హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలో పిల్లలను చదివించడమేంటని మండిపడింది. తమకు ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే హక్కు విద్యార్థులకు ఉందని ఏపీ హైకోర్టు తెలిపింది. సర్కారీ బడుల్లో తెలుగు మీడియాన్ని తొలగించి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధన చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

 

ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని మరోసారి జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించేందుకు చంద్రబాబు అండ్ కో కు మంచి చాన్స్ దొరికినట్టయింది. అసలే తెలుగు మీడియం విషయంలో ఓ అగ్రశ్రేణి దిన పత్రికకు చాలా పట్టింపు ఉంది. ఇప్పుడు దీనికి ఈ కోర్టు తీర్పు కూడా తోడైతే ఇక పచ్చ బ్యాచ్ రచ్చ రంబోలా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 

ఇప్పటికే టీడీపీ ఆధిక్యం ఉన్న శాసన మండలి ఈ ఇంగ్లీష్ మిడియం బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇంగ్లీష్ మీడియం బోధన విషయంలో పట్టుదలగా ఉన్న జగన్ సర్కారుకు ఇటీవల ఏపీ శాసన మండలి షాక్ ఇచ్చింది. విద్య చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించగా.. శాసన మండలి దానికి సవరణలు సూచించింది. ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయించుకునే వెలుసుబాటు విద్యార్థికే ఇవ్వాలని మండలి సూచించింది.

 

తెలుగు మీడియంను కూడా ఉంచాలంటూ బిల్లును తిప్పి పంపింది. ఇప్పుడు కోర్టు కూడా దాదాపుగా ఇదే విషయం చెప్పింది. దీంతో చంద్రబాబు అండ్ కో మరోసారి జగన్ పై విరుచుకుపడే అవకాశాలు ఫుల్లుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: