మనసున్న ముఖ్యమంత్రి అని మరొకసారి వైయస్ జగన్ రుజువు చేసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు కువైట్ దేశానికి ఇక్కడ ఉన్న ఏజెంట్ అక్రమంగా తరలించారు అంటూ సోషల్ మీడియాలో ఏడుస్తూ వీడియో పెట్టడం జరిగింది. అంతేకాకుండా కువైట్ దేశంలో మమ్మల్ని చిత్ర వాదనకు గురిచేస్తున్నారని మమ్మల్ని రక్షించాలి మీరే జగనన్న అంటూ వీడియో ని చాలా సీక్రెట్ గా రికార్డు చేసి సోషల్ మీడియాలో వదలడంతో ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరటంతో వెంటనే సీఎం జగన్ కువైట్ దేశంలో భారతదేశ ఎంబసీ కి ఫోన్ చేసి సదరు మహిళా కష్టాలను తీర్చటానికి రంగంలోకి దిగడం జరిగింది.

 

మంగళవారం సీఎంఓ కార్యాలయం ఆదేశాలతో ’దిశా’ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్‌ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి, దుబాయ్‌ నుంచి వారి స్వగ్రామాలకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించడంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాధితులు స్వదేశానికి రెండు మూడు రోజుల్లో తీసుకురావడానికి చర్యలు కూడా చేపట్టింది జగన్ సర్కార్.

 

అదే సందర్భంలో కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో ఉన్న బాధిత మహిళలు కూడా మరొక వీడియో క్రియేట్ చేసి మేము ఇక్కడ క్షేమంగా ఉన్నామని మాట్లాడుతూ ఆదుకున్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని ఇటువంటి పరిస్థితుల్లో నుండి మళ్లీ ఇంటికి వస్తానని కలలో కూడా ఊహించలేదని మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు అని తెలిపారు. కాగా బాధిత మహిళల కుటుంబాల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇదంతా సోషల్ మీడియా పవర్ వల్ల జరిగిందని ఆపద్బాంధవుడిగా జగన్ ఆదుకోవడం నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: