రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో చెప్ప‌లేం. నాయ‌కులు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో కూడా అంచ‌నా వేయ‌లేం. కొంద‌రు నాయ‌కులు ఇదే పార్టీలో ఉంటార‌నుకుంటే...వారు హ‌ఠాత్తుగా పార్టీ ఫిరాయించేస్తుంటారు. కొంద‌రు ఇలా విధేయ‌త‌ను మార్చేస్తే...ఇంకొంద‌రు అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఏపీలో మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, పెద్ద‌రెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా ఇలాంటి చాన్స్ కోసమే ఎదురుచూస్తున్నార‌ట‌. 

 

తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనురాధ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నుంచి జగన్మోహన్‌రెడ్డి ఇష్టం లేనివని రద్దు చేశారు. జగన్మోహన్‌రెడ్డి రద్దుల రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ``రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులు చనిపోతే చంద్రబాబు నాయుడు రుణామాఫీ చేయడం జరిగింది. దానిని రద్దు చేశారు. జ‌గ‌న్‌ తండ్రి శాసన మండలిని తీసుకోస్తే దానిని ఇవాళ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 33వేల ఎకరాలు రైతులు రాజధాని కోసం ల్యాంగ్‌పూలింగ్‌లో ఇస్తే దానిని విలువ తెలుసుకోకుండా, గతంలో మీరు కూడా రాజధాని అమరావతి కావాలని ఒప్పుకొని గత 42రోజుల నుంచి రైతులను రోడ్డన పడవేసి రాజధానిని కూడా రద్దు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో మైనార్టీలకు రంజాన్‌ తోఫా, క్రిస్టియన్లుకు క్రిస్టమస్‌ తోఫా, హిందువులకు సంక్రాంత్రి కానుకలను రద్దు చేశారు. ఉచిత ఇసుక రద్దు చేశారు. వీటిని రద్దు చేయడం వలన దాదాపు 42మంది చనిపోయారు. కాపుల రిజర్వేషన్‌ రద్దు చేశారు. కాపులు ఏమి తప్పు చేశారని రిజర్వేషన్‌ రద్దు చేశారు? అన్న క్వాంటీన్లను రద్దు చేశారు. రూ.5 పెట్టి పేద ప్రజలకు భోజనం పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది.` అని వ్యాఖ్యానించారు.  

 


``ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఎస్సీ కార్పోరేషను, రుణాలను  రద్దు చేశారు. ఆకస్మాత్తుగా ఎవరైన చనిపోతే చంద్రన్న బీమా పెట్టి రూ.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చంద్రన్న బీమాను రద్దు చేశారు. అమ్మఒడి విషయంలో మోసం చేశారు. రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిసి రూ.1800వేలు ఇవ్వాల్సింది. కానీ రైతులను మోసం చేశారు. అన్నదాత సుఖీభవను రద్దు చేశారు.దేశ వ్యాప్తంగానే కాదు..ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చే విధంగా జగన్మోహన్‌రెడ్డి పీపీఏల‌ను రద్దు చేశారు. `` అని అన్నారు. 

 


ఏపీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్‌రెడ్డి ఖచ్చితంగా జైలు వెళ్తాతారని నిపుణులు చెబుతున్నార‌ని పంచుమ‌ర్తి అనురాధ అన్నారు. ``శశికళ కేవలం రూ.66కోట్లకే జైలుకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రూ.43వేల కోట్లను సీబీఐ జప్తు చేసింది. కాబట్టి జగన్మోహన్‌రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. అందుకే మంత్రులు బొత్స‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గనకే కాకుండా ఎమ్మెల్యే రోజారెడ్డికి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. కాబట్టి వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు.`` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: