మూడు రాజధానుల వద్దు...అమరావతినే ముద్దు అంటూ...టీడీపీ అధినేత నారా చంద్ర’బాబోరు’ అలుపెరగని ఆరాట పడుతూ, పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రజలు మూడు రాజధానులే ముద్దు అంటున్న బాబు మాత్రం ప్రజలకు వ్యతిరేకంగా అమరావతి కోసం డ్రామాలు ఆడుతూ రోడ్లపైకి వస్తున్నారు. పైగా మండలిలో మూడు రాజధానుల బిల్లుని అడ్డుకుని తాత్కాలిక ఆనందపడ్డారు. ఆ ఆనందాన్ని ఒక్కరోజు కూడా ఉంచకుండా జగన్ మండలి రద్దు చేస్తూ షాక్ ఇచ్చారు. దీంతో మళ్ళీ అమరావతి ఉద్యమాన్ని ఉదృతం చేయాలంటూ బాబు రోడ్ల మీదకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

 

అయితే బాబు ఎంత గొంతు చించుకున్న ప్రజలు పెద్దగా స్పందించడం లేదు. ఆఖరికి జనంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని సొంత పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు.  ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న విశాఖ టీడీపీ వాళ్ళు అయితే బాబుకు సైలెంట్ షాక్ ఇస్తున్నారు. ఒక్క నేత కూడా బయటకొచ్చి బాబుకు మద్ధతుగా మాట్లాడటం లేదు. అసలు టీడీపీలో హడావిడి చేసే మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వారు కూడా బయట కనపడటం లేదు.

 

ఇక విశాఖ నగరంలోని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు,గణబాబు, వాసుపల్లి గణేశ్‌లు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు గంటా బయటకొచ్చి విశాఖని ఎగ్జిక్యూటివ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నారు. తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు మాత్రం కాస్త సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారు. అటు బాలయ్య చిన్నల్లుడు, విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన భరత్ కూడా సైలెంట్ అయిపోయారు.

 

అలాగే గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, అనకాపల్లి పీలా గోవింద్, మాడుగులలో రామానాయుడు, చోడవరంలో కే‌ఎస్‌ఎన్ రాజు, అరకులో కిడారి శ్రవణ్, పాడేరులో గిడ్డి ఈశ్వరి...ఇలా విశాఖలో ఉన్న మాజీ నేతలు ఎవరు బయటకొచ్చి బాబుకు మద్ధతుగా మాట్లాడటం లేదు. పైగా వీరిలో కొందరు టీడీపీని వీడే అవకాశముందని చర్చ జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో బాబుకు ఎవరు షాక్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: