ఉన్నది లేనట్లు క్రియేట్ చేయడం... తిమ్మిని బమ్మి చేయడం... నందిని పందిగా చూపించడం...నిజాన్ని దాచి, ఒక అబద్ధాన్నే పదేపదే తీవ్రంగా ప్రచారం చేయడం..ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రజలను ఫూల్స్‌ చేయడం. ఇలా పైన మాట్లాడుకున్న అన్ని మాటలు ఎవరికి బాగా సూట్ అవుతాయని ఏపీ ప్రజలని అడిగితే...అందరూ ఠక్కున టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పేస్తారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన చేసే కార్యక్రమాలు ఇవే. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి బాబు యెల్లో మీడియాని వారథిలా వాడుకుంటారు.

 

ప్రపంచంలో ఆయన వాడినట్లు మీడియాని మరొకరు వాడారు. ప్రతిరోజూ భోజనం చేస్తారో లేదో తెలియదు గానీ మీడియాలో మాత్రం కనిపించకుండా ఉండలేరు. అయితే గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ ఇదే విధంగా యెల్లో మీడియా ద్వారా ఆహా ఓహో అంటూ పొగిడించుకుని, మొన్న ఎన్నికల్లో ప్రజల తిరస్కరించాక జగన్‌పై విష ప్రచారం చేయిస్తున్నారు. ఇక దానికి యెల్లో మీడియాతో పాటు కొన్ని నేషనల్ మీడియా సంస్థలు కూడా వంతపాడుతున్నట్లు తెలిసింది.

 

అందుకనే ఈ మధ్య ఆయన మూడు రాజధానుల అంశంపై పలు నేషనల్ మీడియా సంస్థల్లో మాట్లాడుతూ...జగన్ ప్రభుత్వంపై విషం చల్లారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే...బాబుకు తెలినంతగా జగన్‌కు మీడియా మేనేజ్మెంట్ తెలియదనే చెప్పాలి. ఆయన వరకు ఏదో ప్రజలకు మంచి పథకాలు అందించామా, వారి మేలు కొరకు ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నమా అనే విధానంలోనే వెళ్తారు తప్ప. పెద్దగా బయటకొచ్చి మీడియా ముందు మాట్లాడిన సందర్భాలు లేవు.

 

ఏదో అసెంబ్లీ, లేదా ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభ కార్యక్రమాల్లో తప్ప. అదే బాబు అయితే గత ఐదేళ్లు సీఎంగా ఉండి ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు డప్పు కొట్టుకున్నారో చూశాం కూడా. కానీ అలాంటి అలవాటు జగన్‌కు లేదు. కాబట్టి మీడియా మేనేజ్ చేస్తూ, విష ప్రచారం చేయడంలో బాబే తోపు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: