శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కు అసెంబ్లీ సచివాలయం ఉన్నతాధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన సెలక్ట్ కమిటికి సభ్యులను తీసుకోవటం కుదరదని ఛైర్మన్ కు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.   గడచిన నాలుగు రోజులుగా మండలి కేంద్రంగా జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.  అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులపై చర్చ విషయంలో  అధికార, టిడిపి సభ్యుల మధ్య  మండలిలో రెండు రోజులు పెద్ద యుద్ధమే జరిగింది. చివరకు ఛైర్మన్ ను మ్యానేజ్ చేసుకుని టిడిపి సెలక్ట్ కమిటి పరిశీలనకు బిల్లులను పంపుతున్నట్లు ప్రకటింపచేసుకుంది.

 

మండలిలో మెజారిటి ఉన్న కారణంగా  బిల్లులపై చర్చ జరిపి ఓడగొట్టుంటే సమస్య ఉండకపోను. కానీ ఛైర్మన్ ను మ్యానేజ్ చేసిన విషయం బయటపడటంతోనే సమస్య పెరిగిపోయింది.  సరే ఈ గొడవను పక్కన పెట్టేస్తే అసెంబ్లీ ఉన్నతాధికారులతో ఛైర్మన్ మాట్లాడినపుడు ప్రత్యేకంగా ఛైర్మన్ కు  విచక్షణాధికారమేమి ఉండదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పిన అధికారులు విచక్షణాధికారాల పేరుతో  సెలక్ట్ కమిటికి బిల్లులను పంపుతున్నట్లు ప్రకటించటం కూడా తప్పని చెప్పారు.

 

ముందు ఉన్నతాధికారుల మాటలోని నిజాన్ని గ్రహించిన ఛైర్మన్ కూడా తాను ప్రకటించిన ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయిందని మీడియాతో చెప్పారు. కానీ తర్వాత తెరవెనుక ఏమైందో ఏమో వెంటనే మార్చేశారు. తాను చేసింది కరెక్టే అంటూ పదే పదే చెప్పారు. పైగా సెలక్ట్ కమిటిలకు సభ్యుల పేర్లను తీసుకోమంటూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయటమే సమస్యగా మారింది.

 

సెలక్ట్ కమిటిని నియమిస్తు ఛైర్మన్ చేసిన ప్రకటనే తప్పని అధికారులు చెబుతుండగా ఇపుడు కమిటిలకు సభ్యుల పేర్లను తెప్పించమని ఆదేశించటంతో ఏమి చేయాలో అధికారులకు అర్ధం కావటం లేదు. నియమ, నిబంధనలను వివరిద్దామని అనుకుంటే ఛైర్మన్ అందుబాటులో లేరు. దాంతో ఇదే సమాచారం పంపేసిన అధికారులు పనిలో పనిగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి బుగ్గన ఏమంటారో చూడాలి. మొత్తానికి స్వామి భక్తిని ప్రదర్శించటంలో భాగంగా ఛైర్మన్ మొత్తం వ్యవస్ధనే గబ్బు పట్టించేసినట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: