తెలంగాణ సీన్ ఏపీలో రిపీట్ కానుందా? టీడీపీని జనసేన-బీజేపీలు దెబ్బకొట్టనున్నాయా? అంటే తెలంగాణలో పరిస్థితిలని గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. 2014 రాష్ట్రం విడిపోకముందు వరకు కాంగ్రెస్-టీడీపీలు ప్రత్యర్ధులుగా ఉండేవి. ఇక రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్‌లు ప్రత్యర్ధులుగా ఉన్నాయి. అప్పుడు మూడో ప్లేస్‌లో ఉన్న టీడీపీ నిదానంగా కనుమరుగైపోయింది. కాబట్టి బీజేపీ ఆ స్థానానికి వచ్చింది. అయితే 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్తితి దారుణమైపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి జంప్ అయిపోవడంతో బాగా వీక్ అయిపోయింది.

 

ఇదే సమయంలో 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ కాస్త పుంజుకుంది. కాంగ్రెస్ డౌన్ అయిపోవడంతో, దానికి దరిదాపుల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ రెండు పార్టీల పరిస్తితి ఎలా అయిపోయిందంటే...కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌ని ఢీకొనే శక్తి తగ్గిపోగా, బీజేపీకి టీఆర్‌ఎస్‌ని ఢీకొనే శక్తి రాలేదు. మొత్తం మీద జాతీయ రెండు పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు మాదిరిగా అయిపోయాయి. ఇక ఇదే అడ్వాంటేజ్‌ని అధికార టీఆర్ఎస్ బాగా ఉపయోగించుకుంటుంది. తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా చేసి, వరుసగా పంచాయితీ, లోకల్ బాడీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసుకుంటూ వచ్చింది.

 

అయితే ఇదే పరిస్తితి ఏపీలో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ వీక్ అవుతూ వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు టీడీపీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక జగన్ తీసుకున్న మూడు రాజధానుల దెబ్బకు టీడీపీ మరింత ఇబ్బందుల్లో పడింది. ఇదే సమయంలో జనసేన-బీజేపీలు కలవడం కూడా టీడీపీకే పెద్ద మైనస్ కానుంది. వారు ఎంతో కొంత ఉన్న స్పేస్‌ని ఉపయోగించుకునే అవకాశముంది. రానున్న పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని టీడీపీకి పడకుండా చీల్చే ఛాన్స్ బాగా ఉంది. దాని వల్ల అటు టీడీపీ గెలవలేదు. ఇటు బీజేపీ-జనసేనలు కూడా గెలవలేవు. మొత్తం మీద గ్లాస్-పువ్వు వల్ల సైకిల్‌కి పెద్ద బొక్క పడి...ఫ్యాన్ గిర్ర గిర్రా తిరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: