తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలవడం జరిగింది. ఈ ఎన్నికలలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలను ఏ మాత్రం తెలంగాణ ప్రజలు లెక్క చేయలేదు అన్నట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో టిఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా ఆనందంగా సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. ఇదే సందర్భంలో ప్రగతి భవన్ లో కెసిఆర్..మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఆదరించినందుకు ప్రతి ఓటర్ కి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

కాగా 2 జాతీయ పార్టీలను ఉద్దేశించి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ కూడా అటు ఢిల్లీలోనూ ఇటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఒక మతాన్ని మరియు దారుణమైన ఉద్దేశాలను ఉద్దేశించి పాలన చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడిన కేసీఆర్ దేశంలో తనకంటే గొప్ప హిందువు మరొకరు లేరని తాను చేసిన యాగాలు యజ్ఞాలు బిజెపి పార్టీలో కాదు దేశంలోని ఎవరు చేయలేదని అయినా కానీ టిఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని బిజెపి అవలంభిస్తున్న విధి విధానాలు దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.

 

ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వామీజీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన వల్లే గెలిచాడని నేను ఇచ్చిన తాయత్తు మెడలో కొట్టుకోవడం వల్ల శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల్లో గెలిచాడని...తాయత్తు ఎప్పటికీ ఆయన మెడలో ఉంటుందని స్వామీజీ ఇటీవల మాట్లాడటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. దీంతో కెసిఆర్ పార్టీకి సెంటిమెంట్ పవర్ మరియు తాయెత్తుల పవర్ గట్టిగానే ఉందని అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: