ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు పొందిన నటుడు ప్రకాష్ రాజ్. సినిమా లో ఎటువంటి క్యారెక్టర్ అయినా ఈజీగా వెండితెరపై పండించే ప్రకాష్ రాజ్ ఇటీవల రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో బెంగుళూరు నగరం నుండి పార్లమెంట్ కి పోటీ చేసిన ప్రకాష్ రాజు ఓడిపోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికలలో పాల్గొనక ముందు అప్పట్లో మోడీ పరిపాలన పై అదేవిధంగా దక్షిణాదిలో గౌరీ జర్నలిస్టుని చంపడం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సీరియస్ అయిన ప్రకాష్ రాజ్ అనేకసార్లు బిజెపి పార్టీ విధివిధానాలను వ్యతిరేకించటం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ప్రకాష్ రాజ్ కి నీ అంతు చూస్తానంటూ బెదిరింపు లేఖ ఒకటి రావడంతో ఈ వార్త ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

పేరు అడ్రస్ లేకుండా వచ్చినా ఆ లెటర్ లో ఉన్న వారి పేర్లు అంతు చూస్తామని బెదిరింపులు రావటంతో సోషల్ మీడియాలో ఈ లెటర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కన్నడంలో ఉన్నా ఆ లెటర్లో 15 మంది పేర్లు ఉన్నాయ్. చివరిలో ఆ లెటర్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేరు కూడా ఉంది. మీరంతా ధర్మ ద్రోహులు మరియు దేశద్రోహులు మిమ్మల్ని అంతం చేయడానికి ఈ నెల 29 నుండి పూనుకునుం అంటూ అంతిమయాత్రకు సిద్ధంగా ఉండండి పద్ధతి మార్చుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది అంటూ లెటర్ లో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ లెటర్ ని ప్రకాష్ రాజ్ ట్విటర్లో షేర్ చేశారు. దీంతో కొంతమంది ప్రముఖులు స్పందించారు. ఇదంతా పిరికిపందల చర్య అని కొట్టిపారేశారు.

 

అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ప్రకాష్ రాజ్ కి ఫోన్ చేశారట మీరు వెంటనే హైదరాబాద్ కి రండి మేము సెక్యూరిటీ ఇస్తామని భరోసా ఇచ్చారట. అంతేకాకుండా గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకాష్ రాజ్ సీఎం కేసీఆర్ ని కలవడం జరిగింది. అప్పట్లో కేసీఆర్ పెట్టాలనుకున్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఇద్దరూ చర్చించుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నారు. అటువంటి ప్రకాష్ రాజు కి బెదిరింపులు వచ్చినా విషయం తెలుసుకున్న కేసీఆర్ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారట. దీంతో షూటింగ్ సమయంలో హైదరాబాద్ కి ఎప్పుడొచ్చినా తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందని భరోసా ఇవ్వడంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు డేంజర్ టైంలో సీఎం కేసీఆర్.. ప్రకాష్ రాజు పట్ల బాగా స్పందించారు అని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: