ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కార్  శాసనమండలి రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలన్నీ వేడెక్కిన విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్ష పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంత ప్రభుత్వం కొనసాగుతుందని మరోసారి శాసన మండలి రద్దు నిర్ణయం నిరూపించింది అంటుంది ప్రతిపక్ష టిడిపి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈరోజు వరకు శాసనమండలిలో అధికార వైసీపీ కంటే బలంగా ఉన్న టిడిపి ఇప్పుడు శాసనమండలి రద్దుతో పూర్తిగా బలం లేకుండా అయిపోయింది. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ శాసనమండలి నిర్ణయం తీసుకోవడం వల్ల జగన్ సర్కార్ శాసన మండలి రద్దు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి రద్దు చేయడం పై మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో శాసనమండలిని రద్దు చేసింది టిడిపి ప్రభుత్వమె అంటూ వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో శాసన మండలి రాష్ట్రంలో ఏ మాత్రం అవసరం లేదు అంటూ చెప్పిన వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తి గా చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు అంటూ ఆరోపించారు. 

 

 

 అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయం చేస్తున్న శాసనమండలి ఉండడం నిరుపయోగం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు అంటూ మాజీ ఎంపీ రవీంద్రబాబు తెలిపారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎంతగానో రాజకీయ ప్రయోజనాలు  ఉన్నప్పటికీ తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచించి  జగన్మోహన్ రెడ్డి ...  శాసనమండలిని రద్దు చేశారు అంటూ మాజీ ఎంపీ రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. శాసన మండలి రద్దు...ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అంటూ  తెలిపారు. ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏ ప్రయత్నం చేసిన ప్రజలందరూ ఆయన వెంటే ఉన్నారు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: