నోరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి.. అందులోనూ కీలక పదవుల్లో ఉన్నవారు.. ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనవసరం గా చిక్కుల్లో పడతారు. వారు ఏం మట్లాడినా వివాదం అవుతుంటుంది. ఇదే పరిస్థితి ఎదురైంది తాజాగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు. పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు.

 

ఆయన మరోసారి నోరుజారారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఆయన తాజాగా ఓ ఆసుపత్రిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ప్రసంగించాల్సి వచ్చింది, అప్పుడు పాక్ ప్రధాన మంత్రి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. “ “2013 ఎన్నికల ప్రచారంలో నేను వేదికపై నుండి పడిపోయిన తరువాత నేను షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పుడు, నేను గాయాల కారణంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నాను. కానీ డాక్టర్ అసిమ్ నాకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, నా బాధలన్నీ పోయాయి.

 

" ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారు.. అన్నారు ఇమ్రాన్ ఖాన్. ఆ ఘటన తరువాత ఆసుపత్రి ఆవరణలో ఆయనో టీవీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారట. అయితే అప్పుడు ఏమన్నానో నాకు పెద్దగా గుర్తులేదంటూ తన ప్రసంగం ముగించారు పాక్ ప్రధాని. ఇప్పుడు ఈ కామెంట్లు నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయనపై హెవీ ట్రోలింగ్ జరుగుతోంది.

 

ట్రీట్ మెంట్ ఇచ్చిన నర్సులు నీకు అప్సరసల్లా కనిపిస్తున్నారా.. కనీసం కృతజ్ఞత అయినా లేకుండా ఇలా మాట్లాడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ పలువురు నేతలు ఇలా మహిళలపై అనవసరంగా నోరు పారేసుకుని వివాదస్పదం అయ్యారు. అందులోనూ ప్రధాన మంత్రి పదవి లో ఉన్నప్పుడు ఇంకాస్త నోరు జాగ్రత్తగా ఉండాలి. పాపం.. పాక్ ప్రధాని ఇలా బుక్ అయ్యారు. ఈ ట్రోలింగ్ ఎప్పడు ఆగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: