కాదేదీ రాజకీయానికి అనర్హం.. టీడీపీ అధినేత చంద్రబాబును చూస్తే ఈ వాక్యం గుర్తు రాక మానదు. ప్రతి విషయంలోనూ రాజకీయం వెదకటం ఆయన నైజంగా మారిపోయింది. ఇలా అడ్డగోలుగా విమర్శించడం వల్లే.. తాను ఏం చెప్పినా జనం నమ్ముతారని భావించండం వల్లే ఆయన రాజకీయంగా రోజురోజుకూ పాతాళానికి వెళ్లిపోతున్నారని అంటున్నారు.

 

ఎందుకంటే.. జగన్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడిని ఆణిముత్యంగా చెప్పుకోవచ్చు. నిరుపేదలు కూడా తప్పకుండా బడికి వెళ్లేందుకు ఈ పథకం దోహదపడుతుంది. ఈ పథకం కారణంగా పిల్లలను బాల కార్మికులుగా వివిధ పనుల కోసం వెళ్లేవారు కూడా.. అమ్మ ఒడి పథకం పుణ్యమా అని సర్కారు బడులకు పంపుతున్నారు. జగన్ సర్కారు ప్రవేశ పెట్టిన మిగిలిన పథకాలు కాస్త విమర్శలకు అవకాశం ఉన్నా.. అమ్మఒడి మాత్రం వంక పెట్టలేదని విశ్లేషకులు చెబుతుంటారు.

 

అయితే.. ఈ జనవరిలో అమ్మఒడిని ప్రారంభించిన జగన్.. పిల్లలు తల్లుల ఖాతాలో రూ. 15000వేసేశారు. అంత వరకూ బాగానే ఉంది. అయితే ప్రభుత్వ బడుల బాగు కోసం అందులోనుంచి ఒక్క వెయ్యి రూపాయలు వెనక్కు ఇవ్వమని.. ఆ నిధితో పాఠశాలలను బాగు చేసుకుందామని జగన్ పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ప్రకారం విద్యార్థుల తల్లులు కూడా బాగా స్పందిస్తున్నారు.

 

అయితే దీన్ని కూడా తప్పుబడుతున్న చంద్రబాబు.. “ చివరికి బడిలోనూ రౌడీ వసూళ్లేనా. అమ్మ ఒడి పేరిట బెదిరించి అమ్మల నుంచి.. రూ.వెయ్యి వసూళ్లు చేయడమేంటి. ఇవ్వకపోతే రూ.15 వేలు ఆపేస్తామని బెదిరిస్తారా. ఆ అధికారం మీకెక్కడిది..” అంటూ విమర్శిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వినూత్న పథకాల గురించి పేదల గురించి ఏనాడూ ఆలోచించని చంద్రబాబు..ఇప్పుడు మంచి పథకాలు అమలు చేస్తున్న జగన్ పై ఇలా విచిత్రమైన ఆరోపణలు చూస్తుంటే.. ఆయన్ను ఎవరికైనా చూపించండ్రా బాబూ అనుకుంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: